అణగారిన ప్రజల ఆత్మగౌరవ గొంతుక

నేడు ఈశ్వరీబాయి వర్ధంతి

Eswari Bhayi (File)

దేశ చరిత్ర అంటే మహనీయుల జీవిత చరిత్ర అంటారు విఖ్యాత రచయిత అమెరికన్‌ దార్శనికులు ఎమర్సన్‌. అణగారిన ప్రజలహక్కుల కోసం అహర్నిశలు పోరాడిన ఈశ్వరి బాయి జీవితం ఈ సత్యానికితార్కాణంగా నిలుస్తుంది. జీవిత మంతా తానునమ్మిన సిద్ధాంతం కోసం దళితవర్గాలఅభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా పోరాడిన యోధురాలు ఈశ్వరీబాయి. ఉపాధ్యాయురాలిగా, ఉద్యమకారిణిగా, నాయకురాలిగా, స్త్రీ పక్షపాతిగా నాలుగు దశాబ్దాలపాటు తెలుగుసమాజంలో బహు ముఖంగా పెనవేసుకుపోయిన సాహసమూర్తి ఆమె. సికింద్రా బాద్‌లోని నిజాంస్టేట్‌ రైల్వేలో గూడ్స్‌మాస్టార్‌గా పని చేసే దళిత కులానికి చెందిన భల్లెపు బాలరామస్వామి, రాములమ్మ దంపతులకు 1918 డిసెంబరు1న ఈశ్వరీబాయి జన్మించారు. ప్రాథమిక,ఉన్నత విద్యాభ్యాసం అనంతరం నాటి సామాజిక పరిస్థితులవల్ల13వ యేటనే ‘పూణెకి చెందిన డాII లక్ష్మినారా యణతో వివాహం జరిగింది.ఈ దంపతుల ఏకైక సంతానం డాIIజెట్టిగీత.భర్త అకాలమరణంతో తండ్రివద్దకు వచ్చిన ఈశ్వరీ బాయి స్వతంత్రభావాలతో మెలగడమేకాకుండా ఉపాధ్యాయు రాలిగా,ఉద్యోగినిగా మహిళల స్వావలంబన దిశగాకృషిచేశారు.

అంబేద్కర్‌ చూపిన బాటలో

ఈశ్వరీబాయి ప్రజాసేవ పట్ల అంకిత భావం కలగడానికి కారణం బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ స్ఫూర్తి. ఆయన సిద్ధాంతా లు త్యాగపూరిత చరిత్ర ఆమెపై మిక్కిలి ప్రభావం చూపాయి. 1942జూన్‌లో నాగపూర్‌లో జరిగిన అఖిల భారత దళిత కులాల సభకు హైదరాబాద్‌ రాష్ట్ర ప్రతినిధిగా ఈశ్వరీబాయి హాజరయ్యారు. ఆ సందర్భంలోనే ఆమె ప్రప్రథమంగా అంబే ద్కర్‌ను కలుసుకున్నారు.అదే సదస్సులో అఖిల భారత ఎస్సీ ఫెడరేషన్‌ అనే రాజకీయ సంస్థను ఆయన స్థాపించారు. 1944లో డాIIబి.ఆర్‌ అంబేద్కర్‌ వైశ్రాయి కౌన్సిల్‌ మెంబర్‌గా హైదరాబాద్‌కు రావడం, విక్టరీ ప్లేగ్రౌండ్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగం విన్న ఈశ్వరిబాయి ఉద్యమబాట పట్టింది. అంతేగాక ఆ రోజుల్లో బి.ఎస్‌ వెంకట్రావ్ఞ, భాగ్యరెడ్డి వర్మ, అరిగే రామస్వామి, బత్తుల శ్యామ్‌ సుందర్‌ లాంటి ఉద్దం డులు అంబేద్కర్‌ అనుచరులుగా ఆయన బాటలో పయణిస్తు న్నారు. వారి సరసన చేరిన ఈశ్వరీబాయి నాటి సామాజిక, అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్వహించింది. 1946నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాల పార్టీశాఖలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈశ్వరీబాయి షెడ్యూలు కులాల ఫెడరే షన్‌ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నారు. దళితుల సమస్యల పరిష్కారం కోసం రాజకీయ అధికారంలో భాగం కావడం ముఖ్యమని ఈశ్వరీబాయి నమ్మారు. 1951లో హైద రాబాద్‌ నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో చిలుకలగూడ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. అంగబలం, అర్థబలం ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థిని ఆమె అప్పట్లో ఓడించారు. ముఖ్యంగా మురికివాడలోని వారికి ఇళ్లస్థలాలు ఇప్పించడం, ఆ ప్రాంతంలో మంచి నీటి నల్లాలు ఏర్పాటు చేయించడం, రోడ్లు వేయించడం, మురికివాడల్లోని వారి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవడం లాంటి ఎన్నో ప్రజోపకరమైన పనులు చేయించింది. కార్పొరేటర్‌గా చిత్తశుద్ధితో ఆమె నిర్వహించిన ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు మేయర్‌ మాడపాటి హనుమం తరావ్ఞ ప్రశంసలను అందుకున్నాయి. 1952లో జరిగిన ఎన్ని కలలో షెడ్యూల్‌ కులాల ఫెడరేషన్‌ అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధించలేకపోయింది. దీనితో అంబేద్కర్‌ కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆ పిలుపు అందుకున్న ఈశ్వరీబాయి కార్పొరేటర్‌గా రాజకీయరంగ ప్రవే శం చేసినప్పటికీ తన కార్యకలాపాలను నగరానికే పరిమితం చేయకుండా జిల్లాలకు విస్తరింపచేశారు. అఖిల భారత ఎస్సీ ఫెడరేషన్‌ స్థానంలో రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (పిఆర్‌ఐ) అనే రాజకీయ పార్టీని స్థాపించాలని అంబేద్కర్‌ భావించారు. కొత్తపార్టీకి ఎన్నికల ప్ర ణాళికను సైతం ఆయన రూపొందించారు. పిఆర్‌ ఐ ప్రారంభానికి ముందే ఆయన అకాల మరణం చెందారు. అంబేద్కర్‌ స్ఫూర్తితో ఆయన అను యయులు ఆ పార్టీని ముందుకునడిపించారు. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ శాఖకు ఈశ్వరీబాయి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అంబేద్కర్‌ ఆయన సాధనలో, దళిత జాతి అభ్యున్నతి కోసం ఎన్నో దళిత ఉద్యమాలలో క్రియాశీల పాత్ర పోషించారు.1957,1962లో జరిగినఎన్నికల్లో ఎమ్మెల్యేగాపోటీ చేసి విజయం సాధించలేకపోయారు.ఆర్‌పిఐ నాయకత్వంలో నిర్వహించిన అనేక ఉద్యమాలద్వారా ఆమె ప్రజా బాహుళ్యా నికి దగ్గరయ్యారు.

1967లో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి పిఆర్‌ఐ పార్టీతరపున పోటీచేసి గెలుపొందారు.ఆనాడు మంత్రిగా బాధ్య తలు నిర్వహిస్తున్న బలమైన కాంగ్రెస్‌ అభ్యర్థి సదాలక్ష్మిపై ఈశ్వరిబాయి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా రెండు సీట్లు మాత్రమే గెలవగలిగింది. ఒకరు ఈశ్వరిబాయి కాగా, మరొకరు తూర్పుగోదావరి జిల్లా అల్లవరం నియోజకవర్గం నుంచి ఎన్నికైన బివి రమణయ్య. ఆనాటి ప్రతిపక్ష నాయకులైన తరిమెల నాగిరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య, గౌతులచ్చన్న వంటి వారి పక్కన కూర్చొని ప్రజాసమస్యలపై జంకు లేకుండా ప్రభుత్వాన్ని నిలదీసేవారు. తెలుగు, ఆంగ్లభాషల్లో అనర్గళంగా ప్రసంగిస్తూ తూటాల్లాంటి మాటలతో అధికారపక్షాన్ని గడగడ లాడించే వారామె. దీనితో ఈశ్వరీబాయి సమర్థవంతమైన ప్రతిపక్ష నాయకురాలిగా ఫైర్‌ బ్రాండ్‌ లేడీ లీడర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈశ్వరిబాయి ఏనాడూ పదవ్ఞలకు ప్రలోభ పడలేదు. శాసనసభ్యురాలిగా ఆమె లేవనెత్తిన ప్రజాసమస్యలు దాదాపుగా లేవంటే అతిశ యోక్తి కాదు. రాజకీయాల్లో నైతిక విలువలు కాపాడటంలో ఆమె అందరికి ఆదర్శంగా నిలిచారు. ఈశ్వరీబాయి తెలంగాణ ప్రాంతం నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పటికీ యావదాంద్ర µప్రదేశ్‌కు ఆమె ఆదర్శ ప్రతినిధిగా వ్యవహరించారు. విశాఖలో ఉక్కు కర్మాగారస్థాపన, శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం, రాయలసీమలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, తెలంగా ణలో జిల్లాపరిషత్‌ పాఠశాలల ఆధ్వానస్థితి,కోస్తాజిల్లాలో ఎస్సీ లపై దాడులు, దౌర్జన్యాలు వంటి సమస్యలన్నింటికి ఎంతో ప్రాధాన్యమిచ్చి ఈశ్వరీబాయి శాసనభా వేదికపై చర్చించేవారు.

అలుపెరగని పోరాటం

దళితులపై జరిగే దుర్మార్గాలను ఆమె ఏ దశలోనూ సహించే వారు కాదు. 1968లో రాష్ట్రంలో దళిత ఉద్యమానికి భూమిక అనదగిన కృష్ణాజిల్లాలోని కంచికచర్లలో కోటేశు అనే దళితుని సజీవదహనం దురంతాన్ని అసెంబ్లీలో లేవనెత్తిన ఈశ్వరీబాయి నిందితులను అరెస్టుచేయాలని డిమాండ్‌ చేసి అసెంబ్లీని స్తం భింపచేశారు. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి దొంగతనం చేసినవాడిని సజీవ దహనం చేయకుండా ముద్దుపెట్టుకుంటా రా అని జవాబ్చిచేసరికి మంత్రిపైకి ఆగ్రహంతో కాలి చెప్పును చూపింది.దళితజాతి ఆత్మగౌరవాన్ని చాటిన వీరవనిత ఈశ్వరీ బాయి. ఇది గందరగోళానికి దారి తీయడంతో సి.ఎం కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రిచేత క్షమాపణ చెప్పింది సభను ఈశ్వరీ బాయిని శాంతింపచేశారు.అది నిజానికి ఒక వ్యక్తికివ్యతిరేకంగా ఉద్దేశించిన చర్యకాదు. తరతరాలుగా దళిత ప్రజలపై జరుగు తున్న అత్యాచారాలు, అన్యాయాలు కుల దుర్విచక్షణపై ఈశ్వ రిబాయి ఎత్తిన పిడికిలిఅది. మహిళలు స్వశక్తితో ఆత్మగౌరవం తో బతకాలంటే చదువ్ఞ అత్యవసర మని రెసిడెన్షియల్‌ పాఠ శాలలు ప్రభుత్వం నెలకొల్పాలని శాసనసభలో ఈశ్వరీబాయి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.తొలి దశ తెలంగాణ ఉద్యమం 1969లో ప్రారంభమైంది.తెలంగాణ ప్రజాసమితి ఉపాధ్యక్షురా లిగా ఆమె ఆ ఉద్యమంలోకీలకంగా వ్యవహరించారు.

తెలంగాణ వ్యాప్తంగా అనేక సభలు, సమావేశాలలో పాల్గొని వివిధ అంశాలపై ప్రజలను చైతన్యపరిచేవిధంగా ఉపన్యసించేవారు. 1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణ ప్రజాసమితి 11లోక్‌సభ సీట్లు గెలవడంలో కీలకపాత్ర పోషించారు. 1972 లో వచ్చిన శాసనసభ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నుంచి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా కొంతకాలం జైలుజీవితాన్ని గడిపారు.తెలంగాణ ప్రజల న్యాయ మైన హక్కులకోసం ఆమె అసెంబ్లీలోపల,బయట సైతం అలు పెరగని పోరాటంచేశారు.

తెలంగాణకోసం ఎంతో పోరాటం చేసి న 1977లో లోక్‌సభకు జరిగినఎన్నికల్లో ఆంధ్ర ప్రాంతంలోని అమలాపురంనుండి లోక్‌సభకు పోటీచేసి దాదాపు లక్షడెబ్భైవేల ఓట్లుపొంది అక్కడి ప్రజల అభిమానంపొందారు. ప్రాంతాలకతీ తమైన, విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన అరుదైన రాజకీయ నాయకురాలు ఈశ్వరీబాయి. రాజకీయ ప్రజాసేవా రంగాల్లో విలువలతో కూడిన ఉన్నత ప్రమాణాలను ఆమె నెలకొల్పారు. తుదిశ్వాస విడిచే వరకు అంబేద్కర్‌ మార్గాన్ని ఆమె విడనాడ లేదు.జీవితం చివరివరకు నిరాడంబరంగా గడిపిన ఈశ్వరీబా యి 1991ఫిబ్రవరి 24న తుదిశ్వాస విడిచారు.నేటితరం రాజ కీయనాయకులు అణగారినవర్గాల ప్రజలు ఈశ్వరీబాయి పోరా టస్ఫూర్తిని ఆదర్శంగాతీసుకొని సమసమాజ సాధనదిశగా ముం దుకుసాగాలి.ఆ పోరాటయోధురాలికి అదే నిజమైననివాళి.

  • చెవ్వ రఘుపతిరావు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/