24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్

పింక్ బాల్ తో తొలి వికెట్ తీసిన భారత బౌలర్ గా ఇషాంత్

india team
india team

కోల్‌కతా:కోల్ కతాలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న డేనైట్ టెస్ట్ మ్యాచ్ లో పింక్ బాల్ తో భారత బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. మన పేసర్ల ధాటికి కేవలం 24 పరుగులకే బంగ్లాదేశ్ 4 వికెట్లు కోల్పోయింది. భారత్ తరపున పింక్ బాల్ తో తొలి వికెట్ తీసిన భారత బౌలర్ గా ఘనతను ఇషాంత్ శర్మ సాధించాడు. 4 పరుగులు చేసిన ఓపెనర్ ఇర్ముల్ ను ఇషాంత్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. 15 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయి బంగ్లాదేశ్… 17 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లను కోల్పోయింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/