అందరి శరీరం ఒకేలా ఉండదు

యోగా పొటోలతో ఇషాగుప్తా సందేశం

Isha Gupta
Isha Gupta

బాలీవుడ్‌ బ్యూటీ ఇషా గుప్తా.. అంటేనే కుర్రకారుకు మత్తెక్కించే అందం గుర్తుకొస్తుంది.. ఫొటో షూట్ల కోసం తన అందచందాలన్నీ ఆరబోస్తోంది.. ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌చేస్తూ పర్ఫెక్‌ట ఫిగర్‌కు నిర్వచనంగా మారింది..

అమ్మడు ఏ పిక్‌ పోస్ట్‌చేసినా గంటల్లోనే లక్షల లైక్‌లు సొంతం చేసుకుంటుంది.. ఇక కామెంట్ల గురించి చెప్పనక్కర్లేదు..

ఫొటోలతోనే యోగా వ్యాయామం ఫోజులతో కూడ సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తోంది..

అపుడపుడూఐ ఇంటర్వ్యూల్లో కూడ మాట్లాడుతుంది.. తాజాగా ‘అందరి శరీరం ఒకేలా ఉండదు.. విభిన్నమైన తత్వాలు ఉంటాయి.. పౌష్టికాహారం కాకుండా చెత్తంతా ఎక్కువగా తింటే ఓవర్‌ వెయిట్‌ వచ్చేస్తుంది..

వ్యాయామం చేయకపోయినా ప్రమాదమే..అందుకే ఆరోగ్యం అనేది ఎంతో ముఖ్యం.. అని చెబుతూ ఓ పిక్‌ పోస్ట్‌చేసింది.. అమ్మడి కెరీర్‌ పరంగా చూస్తే.. హిందీలో బ్లాక్‌ బస్టర్‌ జన్నత్‌ 2 సినిమాతో ప్రారంభించింది.

. ఈ సినిమా రొమాంటిక్‌ హిట్‌గా నిలిచింది..తర్వాత ఈ భామ కేవలం హిందీ సినిమాలకే పరిమితం అయ్యింది.. 2017లో వీడెవడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది..

గత ఏడాది రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కిన ‘వినయ విధేయ రామ సినిమాలో ఓ పాటలో మెప్పించింది..

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/