రాజధాని లేకుండా ఏ రాష్ట్రమైనా ఉందా?

anagani satya prasad
anagani satya prasad

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిపై వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం మాట మార్చడంపై టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ తీవ్ర విమర్శలు చేశారు. శాసనసభ సాక్షిగా రాజధాని అమరావతి మార్చబోమంటూ ప్రకటించిన ప్రభుత్వం 24 గంటలకు గడవక ముందే మాటా మార్చిందని సత్యప్రసాద్‌ ఆరోపించారు. ఇది రాజధాని ప్రజలను మోసం చేయడమేనని సత్యప్రసాద్‌ అన్నారు. వైఎస్‌ఆర్‌సిపి నాయకులు శాసనసభను అసత్య ప్రచారాలకు వేదికగా చేసుకోవడం బాధాకరమని, రాజధానికి అడ్డుపడుతూ చారిత్రక తప్పిదం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. దేశంలో రాజధాని లేకుండా ఏ రాష్ట్రమైన ఉందా అని ప్రశ్నించారు. రాజధాని లేకుండా పరిశ్రమలు ఎలా వస్తాయని ఆమాత్రం ఇంగీతం లేదా అని విమర్శలు చేశారు. రాష్ట్రంలో టిడిపి నేతలపై ప్రతీకారం తీర్చుకోవడంపై చూపిస్తున్న శ్రద్ధ సీఎం జగన్‌ పరి పాలనపై ఎందుకు చూపడం లేదని దుయ్యబట్టారు. హైకోర్టు తీర్పుతోనైనా ప్రభుత్వం కార్యాలయాలకు, ఇతర భవనాలకు పార్టీ రంగులు వేయడం ఆపాలని సత్యప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/