కరోనాపై పోరాటంలో ప్రైవేట్‌ వైద్యులకు బాధ్యత లేదా?

ఇంటికే పరిమితం అయితే ఎలా?

Private Doctors
Private Doctors

ప్రభుత్వం కరోనా లాక్‌డౌన్‌ ప్రకటించిన దగ్గర నుండి నగరాలలో అనేక ప్రైవేట్‌ ఆస్పత్రుల ముందు కేవలం అత్యవసర చికిత్స మాత్రమే అందించబడును అని బోర్డులు దర్శనమిస్తున్నాయి.

అంతవరకూ సామాన్య రోగులతో వారి బంధుగణంతో కిటకిటలాడిన ప్రైవేట్‌ ఆస్పత్రులు ఒక్కసారి గా ఎవరో మంత్రమేసినట్లు బోసిపోయాయి.

రోడ్డు మీద ఎక్కడ ప్రమాదం జరిగినా అంబులెన్సుల మొదటి అడుగు ప్రైవేట్‌ ఆస్పత్రులవైపే పడేది. విచిత్రంగా ఇప్పుడు ఏ అంబులెన్సు ప్రైవేట్‌ వైపు చూడటం లేదు.

గంట గంటకు క్రికెట్‌ స్కోరులా బయటికి వచ్చే ప్లేట్లేట్‌ కౌంటింగ్‌ ఆగిపో యింది. అంబులెన్సుల మోతలు అప్పుడప్పుడే వినిపిస్తు న్నాయి.

మొదట్లో ఇదంతా లాక్‌డైన్‌ మహిమేమో అనుకు న్నారంతా తీరా చూస్తే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఓపితో కలిపి దాదాపు సాధారణ సేవలన్నీ నిలిచిపోయాయి.

అందుకే ఇలా వెలవెలబోతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల కంటే మెరుగైన సేవలు అందిస్తాం, పరిశుభ్రమైన వాతావరణం అందిస్తాం, ప్రపంచస్థాయి వైద్యం మాకు అందుబాటులో ఉన్నది, అన్నిరకాల హెల్త్‌కార్డులు, ఆరోగ్యశ్రీలు కూడా అందుబాటులో ఉన్నాయి.

24/7 అంబులెన్సులు అందు బాటులో ఉంటాయి.రోగుల సేవే మాకు పరమార్థం అంటూ టీవీల్లో, పేపర్లలో ఊదరగొట్టిన ప్రైవేట్‌ ఆస్పత్రి వర్గాలు నేడెందుకు స్తంభించిపోయాయన్నది సామాన్యునికి అర్థంకాని ప్రశ్న.

కరోనా కల్లోలంలో ప్రభుత్వ వైద్యులమీద ఒత్తిడి తగ్గించే ఉద్దేశ్యంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపి సేవలు నిలి పివేశారు.కరోనా భయంతో లాక్‌డౌన్‌ నెపంతో వైద్యులంతా ఇంటికే పరిమితమైతే సామాన్యుల పరిస్థితి ఏమిటి?

  • రమణ్‌కుమార్‌

తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/