కరోనా పోయేనా? ఆర్థిక వ్యవస్థ నిలబడేనా?

ఆర్థిక రంగం విలవిల !

corona effect
corona effect

దేశంలో వినియోగం భారీగా తగ్గిపోయింది.దీనితో ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు గణనీయంగా తగ్గిపోతుంది. లాక్‌డౌన్‌కారణంగా కొన్ని సంస్థలు మూతపడ్డాయి.

ప్రజలు కేవలం నిత్యవసర వస్తువ్ఞలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. కావ్ఞన అన్ని రంగాలు మూతపడడం వల్ల ఆర్థికవ్యవస్థ కకావికలం కానుందని అంచనావేశారు

.ఆర్థికవిశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఆర్థికవ్యవస్థ పునర్జీవనం జరగాలంటే 2021-22, 2022-23 సంవత్సరాలకు పడుతుందని అంచనా వేశారు.

భారతదేశం అనుకున్న ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలంటే కనీసం 12 నుండి 14 శాతం వృద్ధిరేటు ఉండాలి. ఈ విపత్కర పరిస్థితిలో 2.5 శాతం వృద్ధిరేటు సాధించడం సవాలే.

ప్ర పంచంలో కరోనా వైరస్‌ సృష్టించిన అలల తాకిడికి ప్రపంచ దేశాలన్ని ఉక్కిరి బిక్కిరి అవ్ఞతూ చావ్ఞ బతుకుల చుట్టూ తిరుగుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఈ ఉపద్రవం అన్ని వర్గాల ప్రజా సముహాలను నిశ్శబ్దం కౌగిలించుకుం ది. వారి జీవితాలను దుర్లభం చేస్తుంది.

ఈ నేపథ్యంలో కరోనా మహామ్మారి మాంద్యప్రభావంతో సంక్షోభంలో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.

అత్యత వేగంగా ఆర్థ్ధికం గా వృద్ధి చెందుతున్న దేశాలు ఈ మహామ్మారికి ప్రధానకేంద్రంగా ఉన్నందున ఆదేశాల ఉత్పత్తి క్షిణిస్తుంది.

ఈ వ్యాధి ప్రపంచ దేశాలన్నింటిలో ప్రబలడం వలన ఒక దేశంనుండి మరొక దేశానికి ముడిపదార్థాలు సరఫరా చేసుకోలేని స్థితిలో ఉన్నాయి. స్థూలంగా ప్రపంచ ఉత్పత్తి భారీస్థాయిలో దెబ్బతింటుంది.

ఫలితంగా ప్రపంచ సమిష్ఠి డిమాండ్‌ కుదింపుకు గురవ్ఞతుంది. దీనికి అద నంగా దేశాలమధ్య పర్యాటకుల,ప్రయాణికుల సంఖ్యగణనీయంగా పడిపోవ్ఞటంవల్ల విమానయాన, నౌకాయాన రవాణా అతిద్య పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతింటాయి.

ఈ పరిశ్రమల సాంకేతికంగా మరింత ‘గుణక ప్రభావం చూపుతుంది.

కాబట్టి ఈ మహమ్మరి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భారీ స్థాయి కుదింపుకు గురిచేసిందనేది యదార్థం.

రోజురోజుకి విజృంభిస్తూ కోరలు చాస్తున్న కరోనాను కట్టడి చేయాలని ఒకసారి విస్తరిస్తే దానిని నివారించడం అంత సులభం కాదనేది ప్రపంచదేశాలే సాక్ష్యంగా కళ్లముందు కదలాడు తున్నాయని అది రాకుండా చూసుకోవడమే మన బాధ్యత అంటూ భారతీయ వైద్య పరిశోధనా మండలి హెచ్చరిస్తూనే ఉంది.

కరోనా కేసులు కోలువడమే మన బాధ్యత అంటూ భారతీయ వైద్య పరి శోధనా మండలి హెచరిస్తూనే ఉంది. కరోనా కేసులు 69 శాతం ఉధృతిని కేవలం ‘లాక్‌డౌన్‌ ద్వారానే తగించడం సాధ్యపడుతుం దని మార్గ నిర్దేశనం చేసింది.

దీనితో ఒక్కసారిగా వేల కేసులు వచ్చిపడి వైద్య ఆరోగ్య రంగం కుదేలైపోయే దురవస్థను నివారిం చగలుగుతామని గట్టిగా సూచించింది.

శాస్త్రసాంకేతిక పేరు పొంది న అమెరికా, ఇటలీ, స్పెయిన్‌లు సైతం కరోనా కేసులతో బెంబే లెత్తున్నాయి.

1918లో స్వానిష్‌ప్లూ మహమ్మారి ప్రపంచం మీద విరుచుపడినపుడు సామాజిక దూరం లాంటి అలావాలు సానూ కూల ప్రభావం చూపినాయి.

నేడు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు కొవిడ్‌-19 వ్యాప్తిని అడ్డుకునేందుకు ముఖ్యమైన నిరో ధకంగా సామాజిక దూరాన్ని ఎంచుకున్నాయి.

అందులో అభివృద్ధి చెందిన దేశాలలో ఉన్న అవకాశాలు భారతదేశానికి లేవ్ఞ. చైనా లాగా కమ్యూనిస్టు పాలనలలేదు అమెరికాలాటి ధనిక దేశంకాదు.

దేశంల్లో అత్యంత జనాభా అతి తక్కువ సగటు వైద్య సదుపా యాలున్నాయి. దేశంలో ఎక్కువ మంది రోజువారి వేతనాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఇటువంటి పరిస్థితులో ఈ భయంకర వ్యాధి నుండి మనల్ని మనమే కాపాడుకోవాలంటే భిన్నమైన పద్ధతుల్ని అనుసరించడే మార్గం.

ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోడీకి భారత్‌కు ఒక అభివృద్ధి నమునా తయారు చేసుకోవాలనే సూచన మూడు వారాల లాక్‌డౌన్‌ ప్రకటనకు దారితీసాయి.

ప్రపంచ వ్యాప్తంగా 198 దేశాల్లో కొవిడ్‌-19 కేసుల సంఖ్య తొలిలక్షకు చేరడానికి 67 రోజులు పడితే వాటికి మరో లక్ష చేర డానికి కేవలం 11రోజులే పట్టింది. పట్టుమని మరో 4 రోజుల్లో మరో లక్ష కేసులు నమోద అయ్యాయి.

నేడు మరింతగా విజృం భించి భారీగా 5,36,436 పాజిటివ్‌ కేసులు నమోదు అయి నాయి. నేటికి మృతుల సంఖ్య 24,112కాగా రికవరి అయిన కేసులు 1,24,295 .

]ఇండియాలో తొలి యాబై కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూడడానికి 40 రోజులు పడితే నాటికి మరో యాభై జతపడటానికి 5 రోజులు పట్టింది. పిమ్మట మరో 5 రోజులో మరో 100 కేసులు నమోదు అయ్యాయి.

తెలంగాణ లో 69 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 11మందికి రికవరీ జరి గింది. నేటికి ప్రాణనష్టం జరగకుండా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి.

ప్రస్తుతం ఈ క్లిష్ట పరిస్థితులను గట్టిక్కించేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో జనాభా మొత్తానికి హెల్త్‌ఫ్రొఫైల్‌ను సర్వే చేయిం చాలి. నేటివరకు భారత దేశంలో వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

పదుల సంఖ్యలో మరణాలున్నా యి.ఇప్పటివరకు ఉన్న కేసులు పరిమితం కనుక ప్రభుత్వ డయోగ్నాస్టిక్‌ సెంటర్‌లో పరీక్షలు జరుపుతున్నారు.

ఒకవేళ కరోనా వైరస్‌ సోకినవారి సంఖ్య పెరిగితే ప్రైవేటు వైద్యశాలల్లో ఉచితంగా పరీక్షలు, వైద్యం అందిచేందుకు ముందుగా చర్యలు తీసుకోవాలి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు, శానిటౌజర్స్‌, మాస్క్‌లు హాండ్‌వాష్‌లు సరఫరా చేస్తున్నాయి.

ఇంత పెద్ద ప్రజా సంక్షోభం వచ్చినపుడు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ప్రభుత్వానికి సహకరించేలా ప్రభుత్వాలు సంస్థలను ప్రజలను చైతన్య పరచాలి. వైరస్‌ సోకిన వారి సంఖ్య పెరిగితే ప్రైవేటు వైద్యశాలల్లో ఉచితం గా పరీక్షలు, వైద్యం అందిచేందుకు ముందుగా చర్యలు తీసుకోవాలి.

గతంలో ఎన్నడూ కనివిని ఎరుగని రీతిలో 130 కోట్లకుపైగా జనం గృహనిర్బంధంలో ఉన్న పరిస్థితుల్లో దేశంలో నిత్యావసరా లు సక్రమంగా లబ్ధిదారుల ఇళ్లకు చేరేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలు గట్టిగా చర్యలు తీసుకోవాలి.

నిత్యజీవితావసరాల కోసం జనం రోడ్ల మీదకు రాకుండా, కూరగాయలు, పాలు, పండ్లు, నీళ్ల లాంటివి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి.

గ్రామా లను, పట్టణాలను, నగరాలను యూనిట్లుగా విభజించి, శాని టైజర్స్‌, మాస్కూల భద్రతలో ఉన్న సిబ్బందితో నిత్యవసరాలను అందించగలిగితే ఈ ప్రభుత్వాలు కరోనా మహమ్మారిపై విజయం సాధిస్తాయి.

కాని ప్రజలే జాగ్రత్తలు తీసుకోవాలని, ఉచిత సలహా లిస్తే ప్రజారోగ్యాన్ని గాలికి వదిలినట్లు అవ్ఞతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గోదాముల్లో ఉన్న ఏడున్నర కోట్ల టన్నుల ఆహారధాన్యాన్ని మారుమూల పల్లె నుండి పట్టణాల వరకున్న ప్రజలందరికీ ఉచితంగా ప్రణాళికా బద్ధంగా సరఫరా చేయాలి.

ఈ విపత్తు సమయంలో రాజకీయ పార్టీల సమన్వయం చాలా అవసరం. ప్రతిపక్షాలు అన్న తేడాలు లేకుండా అందరు కలిసి ముందుకు నడవాలి.

కరోనా దెబ్బకు ఆర్థికరంగం విలవిల్లాడుతుం ది. పాఠశాలలు, కాలేజీలు, మాల్స్‌, పరిశ్రమలు, దుకాణాలు, ఆఫీసులు, కంపెనీలన్నీ మూతపడ్డాయి. దేశంలో వినియోగం భారీగా తగ్గిపోయింది.దీనితో ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు గణనీయం గా తగ్గిపోతుంది. లాక్‌డౌన్‌ కారణంగా 50శాతం ఉత్పత్తి ఆగి పోయింది

. దీని విలువ సుమారు రూ. 9.10 లక్షల కోట్లు. ప్రస్తుత భారత జిడిపిలో ఇది నాలుగు శాతంగా ఉంటుందని, బ్రిటిష్‌ బ్రోకరేజీ సంస్థ చార్‌క్లేస్‌ వెల్లడించింది.

ఇదే విషయాన్ని కేర్‌ రేటింగ్‌ సంస్థ ఈ 21 రోజుల లాక్‌డౌన్‌తో రోజుకు రూ. 35వేల కోట్ల నుండి రూ. 40వేల కోట్ల చొప్పున అనగా 9.4 లక్షల కోట్ల ఉత్పత్తి నష్టపోతుందని అంచనావేసింది.

ఇక మూడీస్‌ నివేదిక ప్రకారం 2020జిడిపి వృద్ధిరేటు 5.3 శాతం ఉంటుందని మూడు వారాల క్రితం అంచనా వేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ వృద్ధిరేటు 2.5 శాతానికి సవరిస్తూ నివేదిక విడు దల చేసింది

అదే విధంగా సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియాన్‌ ఎకానమీ ఎన్నడూ చూడని పరిస్థితులో భారత ఆర్థిక వ్యవస్థ ఉన్నదని వ్యాఖ్యానించింది.

ఈ ప్రభావంతో రూ.30వేల కోట్ల విలువైన టూరిజం పరిశ్రమలో నాలుగు కోట్లమంది పనిచేస్తున్నా రు. ఈ లాక్‌డౌన్‌తో 12 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఏవియేషన్‌ ఇండస్ట్రీస్‌కి 2.2 లక్షల కోట్ల నష్టం ఇందులో 3.5 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ఈ 21 రోజుల నష్టం ఎనిమిదివేల 200 కోట్లుగా అంచనా వేశారు.లాక్‌డౌన్‌కారణంగా కొన్ని సంస్థలు మూతపడ్డాయి. ప్రజలు కేవలం నిత్యవసర వస్తువ్ఞలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు.

అన్ని రంగాలు మూతపడడం వల్ల ఆర్థిక వ్యవస్థ కకావికలం కానుందని అంచనావేశారు.

ఆర్థిక విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఆర్థిక వ్యవస్థ పునర్జీవనం జరగాలంటే 2021-22, 2022-23 సంవత్సరాలకు పడుతుందని అంచనా వేశారు.

భారతదేశం అనుకున్న ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలంటే కనీసం 12 నుండి 14 శాతం వృద్ధిరేటు ఉండాలి. ఈ విపత్కర పరిస్థితిలో 2.5 శాతం వృద్ధిరేటు సాధించడం సవాలే.

  • డాక్టర్‌ ఎ.పున్నయ్య

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/