కవలలకు జన్మనిచిన ఉక్కు మహిళ

Irom Sharmila
Irom Sharmila

బెంగుళూరు: మణిపూర్‌ పౌర హక్కుల కార్యకర్త, ఉక్కు మహిళ ఇరోమ్‌ షర్మిల మే 12న మాతృదినోత్సవం నాడే కవలలకు జన్మనిచ్చారు. బెంగళూరు మల్లేశ్వరంలోని క్లౌడ్‌నైన్ గ్రూప్ దవాఖానలో ఆమె పండంటి కవల ఆడపిల్లలు పుట్టారు.తల్లీపిల్లలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ శ్రీప్రద వినేకర్ తెలిపారు. 2017 ఆగస్టులో ఇరోమ్ షర్మిల, బ్రిటీష్ పౌరుడు డెస్మండ్ కౌటినోను పెండ్లి చేసుకున్నారు. 16ఏండ్ల పాటు సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేసిన ఈమె 2016లో దీక్ష విరమించారు. ఆ తర్వాత పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయెన్స్ పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ కవల పిల్లలకు నిక్స్ శక్తి, ఆటామన్ తారా అని నామకరణం చేశారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/