సచిన్‌పై ఇర్ఫాన్‌ కొడుకు బాక్సింగ్‌ పంచులు

ఆనందంతో మురిసిపోయిన క్రికెట్‌ దిగ్గజం

Sachin tendulkar and irfan pathans son
Sachin tendulkar and irfan pathans son

ముంబయి: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌పై ఇర్ఫాన్‌ పఠాన్‌ కొడుకు ఇమ్రాన్‌ పంచుల వర్షం కురింపించాడు. ఓ టేబుల్‌ పైకి ఎక్కి సచిన్‌ కంటే తానే పొడుగ్గా ఉన్నానని సచిన్‌ ఆట పట్టిస్తూ బాక్సింగ్‌ పంచులు విసిరాడు. అయితే ఈ విషయం స్వయంగా ఇర్ఫాన్‌ పఠాన్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొన్నాడు. అసలు విషయానికొస్తే.. ఇదే రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో సచిన్‌తో పాటు ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే తన కొడుకు ఇమ్రాన్‌ను తీసుకుని వచ్చి మ్యాచ్‌కు హాజరయ్యాడు. అయితే ఈ సందర్భంగా ఓ సరదా సన్నివేశం జరిగింది. ఇర్ఫాన్‌ కుమారుడు ఇమ్రాన్‌ క్రికెట్‌ దిగ్గజంతో తన కండలు చూపిస్తూ బాక్సింక్‌ చేశాడు. దీంతో అమాయకత్వంతో చేస్తున్న పనికి సచిన్‌ మురిసిపోయాడు. అయితే ఇర్ఫాన్‌ పఠాన్‌ పోస్టు చేయగా, సచిన్‌ కూడా దీనికి రీట్వీట్‌ చేశాడు. చిన్నారులతో ఆనందాన్ని పంచుకోవడం ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటుంది అంటూ పేర్కొన్నాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/