అరంగేట్రంలోనే అదరగొట్టిన ఐఆర్సీటీసీ

101 శాతం పెరిగిన ఈక్విటీ ధర

IRCTC
IRCTC

న్యూఢిల్లీ: ఇటీవల ఐపీఓకు వచ్చి నిధులను సమీకరించుకున్న రైల్వే ఆన్ లైన్ టికెటింగ్, టూరిజం కేటరింగ్ కంపెనీ ఐఆర్సీటీసీ, నేడు స్టాక్ మార్కెట్ లో తొలి రోజు లిస్టింగ్ అయింది. ట్రేడింగ్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే సంస్థ ఈక్విటీ విలువ అదరగొట్టే రేంజ్ లో దూసుకెళ్లింది. రూ. 320 ఇష్యూ ప్రైస్ కాగా, ఏకంగా 101 శాతం లాభపడి రూ. 644కు చేరింది. ఎన్ఎస్ఈలో రూ. 95. శాతం పెరిగింది. దీంతో ఐఆర్సీటీసీ సంస్థ మార్కెట్ విలువ రూ. 5 వేల కోట్ల నుంచి రూ. 10,972 కోట్లకు చేరుకుంది. కాగా, కేంద్ర ప్రభుత్వ డిజిన్వెస్ట్ మెంట్ విధానంలో భాగంగా, ఐఆర్సీటీసీలో వాటాలను విక్రయించి రూ. 645 కోట్లను సేకరించిన సంగతి తెలిసిందే. ఐపీఓకు వచ్చిన నాలుగో రైల్వేలకు చెందిన సంస్థగా ఐఆర్సీటీసీ నిలిచింది. గతంలో ఆర్ఐటీఈఎస్, రైల్ వికాస్ నిగమ్, ఐఆర్సీవోఎన్ లు ఐపీఓలకు వచ్చి విజయవంతమైన సంగతి తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/