వైట్ హౌస్ వద్ద హైఅలర్ట్

భద్రతను పటిష్ఠం చేసిన సెక్యూరిటీ

white house
white house

వాషింగ్టన్‌: ఇరాక్ లోని అమెరికా సైనికుల ఎయిర్ బేస్ పై ఇరాన్ దాడుల అనంతరం యూఎస్ లోని వాషింగ్టన్ డీసీలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ అధికారిక నివాసం వైట్‌ హౌస్‌ లో హై అలర్ట్ ప్రకటించారు. అమెరికాపై కారాలు, మిరియాలు నూరుతున్న ఇరాన్, ట్రంప్ తలపై 80 మిలియన్‌ డాలర్లు (రూ. 575.44 కోట్లు) నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఇరాన్ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో, వైట్ హౌస్ చుట్టూ స్నిప్పర్స్ ను మోహరించారు. వైట్ హౌస్ పరిధిలో ఇప్పటికే నో ఫ్లయ్ జోన్ అమలులో ఉండగా, దాని పరిధిని పెంచారు. హై సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్టు యూఎస్ లా ఎన్ ఫోర్స్‌ మెంట్ అధికారులు తెలిపారు. వైట్‌ హౌస్‌ చుట్టుపక్కల భద్రతను పెంచినట్టు తెలిపారు. అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు, సాయుధ భద్రతా బలగాలు పహరాను పటిష్ఠం చేశాయన్నారు. యూఎస్ పై తాము క్షిపణి దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/