ఇరాన్‌ దేశ ఉపాధ్యక్షురాలికి కరోనా వైరస్‌

ఇరాన్‌లో ఇప్పటి వరకు కరోనా సోకి 26 మంది ప్రాణాలు కోల్పోయారు

Iranian Vice President Masoumeh Ebtekar -r Coronavirus
Iranian Vice President Masoumeh Ebtekar – Coronavirus

ఇరాన్‌: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) అన్ని దేశాలపై పంజా విసురుతుంది. ఈనేపథంలో ఇరాన్ దేశ ఉపాధ్యక్షురాలు మస్సౌమీ ఎబ్తేకర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆమెను సొంత నివాసంలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఇరాన్ పార్లమెంట్ నేషనల్ సెక్యూరిటీ హెడ్ మొజ్తబాకు కూడా ఈ మహమ్మారి సోకింది. దీంతో, తనకు తాను నిర్బంధం విధించుకున్నానని ఓ వీడియో ద్వారా ఆయన వెల్లడించారు. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 26 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిన్న ప్రకటించింది. కరోనా సోకిన వారి సంఖ్య 245కి చేరుకుందని… వీరిలో 106 మంది ఒక్క రోజులోనే ఈ మహమ్మారి బారిన పడ్డారని తెలిపింది. కరోనా భయాలతో ఇరాన్ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కాగా ఇప్పటికే ఇరాన్ డిప్యూటీ హెల్త్ మినిస్టర్ కు కరోనా సోకింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/