కరోనా దాడి..70వేల మంది ఖైదీలు విడుదల

కరోనా బారిన పడి ఇరాన్ లో ఇప్పటికే 237 మంది మృతి

Iran temporarily releases 70,000 prisoners
Iran temporarily releases 70,000 prisoners

ఇరాన్‌: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) పలు దేశాలను కలవరపెడుతుంది. ఈవైరస్‌ బారిన పడిన దేశాలో ఒకటైన ఇరాన్, సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇరాన్ లో మృతుల సంఖ్య 237కు పెరిగి, వైరస్ బాధితుల సంఖ్య 7 వేలను దాటిన వేళ, జైళ్లలో ఉన్న నేరస్తులను విడుదల చేయాలని నిర్ణయించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో వివిధ రకాల నేరాలు చేసి, శిక్షను అనుభవిస్తున్న దాదాపు 70 వేల మందిని విడుదల చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ జ్యుడీషియరీ చీఫ్ ఇబ్రహీం రైసీ వెల్లడించారు. ఖైదీల విడుదలపై ఇరాన్ పత్రికలు, వెబ్ సైట్లలో ప్రత్యేక కథనాలు వెలువడ్డాయి. ఈ నిర్ణయంతో సమాజంలో అభద్రతా భావం కలుగబోదని ఇబ్రహీం వ్యాఖ్యానించారు. ఇక విడుదల చేసిన వారిని వైరస్ ప్రభావం తగ్గిన తరువాత తిరిగి జైళ్లకు తరలిస్తారా? లేదా? అన్న సంగతిని మాత్రం ఆయన వెల్లడించ లేదు.

తాజా ఇంగ్లీష్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/english-news/