ఇరాన్‌ అదుపులో ఉన్న 9మంది నావికుల విడుదల!

మరో ముగ్గురు ఇంకా వారి చెరలోనే

British oil tanker seized
British oil tanker

న్యూఢిల్లీ: ఇరాన్‌ ఎమ్‌టీ రియా అనే నావను అదుపులోకి తీసుకున్న విషయ తెలిసిందే. అందులో మొత్తం 12 మంది భారత సిబ్బంది ఉన్నారు. అయితే తాజాగా వారిలో తొమ్మిది మందిని ఇరాన్‌ దేశం విడుదల చేసినట్లు అధికారిక వర్గాల నుంచి సమాచారం. కాగా మరో ముగ్గురు ఇంకా వారి చెరలోనే ఉన్నారు. ఇటీవల అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఇరాన్‌ పలు నావలను నిబంధనల ఉల్లంఘనల పేరిట అదపులోకి తీసుకుంది. దీంతో అనేక మంది భారతీయులు వారి అదుపులోకి వెళ్లారు. ఇటీవల అదుపులోకి తీసుకున్న బ్రిటన్‌ నౌక స్టెనా ఇంపెరోలో ఉన్న 18 మంది భారతీయులు సహా 21 మంది ప్రస్తుతానికి ఇరాన్‌ చెరలో ఉన్నారు.
అలాగే గ్రేస్‌1 నావలో ప్రయాణిస్తున్న 24 మంది భారత నావికులను జీబ్రాల్టర్‌ పోలీసు అథారిటీస్‌ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. లండన్‌లోని భారత రాయబారులు వారిని బుధవారం కలిశారని విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. వారిని విడుదల చేయించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.


తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/