ఉక్రెయిన్ విమానాన్ని కూల్చింది రెండు మిసైల్స్: ఇరాన్



plane crashes
plane crashes

ఇరాన్‌: ఉక్రెయిన్ కు చెందిన విమానాన్ని ఈ నెల 8న తామే పొరపాటున కూల్చి వేసినట్టు అంగీకరించిన ఇరాన్, మరిన్ని వివరణలు ఇచ్చింది. తమ సైన్యం ప్రయోగించిన రెండు క్షిపణులు ఆ విమానాన్ని తాకాయని, టెహ్రాన్ నుంచి బయలుదేరిన కాసేపటికే, శివార్లలో అది కూలిపోయిందని తెలిపింది. ‘టార్ ఎం1’ రకం మిసైల్స్ ను తమ సైన్యమే ప్రయోగించిందని తెలిపింది. ఇక విమానంలోని బ్లాక్‌ బాక్స్‌ లను డీకోడ్‌ చేసేంత టెక్నాలజీ తమ వద్ద లేదని, దీనికోసం అమెరికా, ఫ్రాన్స్‌ల సాయం కోరామని ఇరాన్ పౌర విమానయాన అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆ దేశాల నుంచి సానుకూల స్పందన కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. కాగా, టార్‌ ఎం1 మిసైల్స్ ను భూమిపై నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించేందుకు సోవియట్‌ యూనియన్‌ తయారు చేసింది. వీటిని గతంలోనే ఇరాన్ కొనుగోలు చేసింది.

తాజా ఎడిటోరియల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial/