ఇరాన్ దాడుల అనంతరం ట్రంప్ రియాక్షన్

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీ వ్యవస్థ మాకు ఉంది

trump
trump

వాషింగ్టన్‌: ఇరాన్ టాప్ కమాండర్ ఖాసిం సులేమానీని అమెరికా హతమార్చి తర్వాత… ఇరాక్ లోని అమెరికా ఎయిర్ బేస్ లపై ఇరాన్ క్షిపణి దాడులు చేయడంతో… పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ పరిణామాలు ఎంత దూరం వెళ్తోయోననే ఆందోళన సర్వత్ర నెలకొంది. మరోవైపు, ఇరాన్ చేసిన దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లైట్ గా తీసుకున్నారు. ఇరాన్ దాడుల అనంతరం ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ, సింపుల్ గా… ‘ఆల్ ఈజ్ వెల్’ అని కామెంట్ చేశారు. ఇరాక్ లోని తమ రెండు మిలిటరీ బేస్ లపై ఇరాన్ క్షిపణులను ప్రయోగించిందని ట్రంప్ తెలిపారు. ప్రాణనష్టంతో పాటు, స్థావరాలకు జరిగిన డ్యామేజీలపై సమీక్ష జరుగుతోందని చెప్పారు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉందని అన్నారు. ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా తమకు అత్యంత శక్తివంతమైన, అత్యాధునిక మిలిటరీ వ్యవస్థ ఉందని చెప్పారు. రేపు ఉదయం పూర్తి స్థాయిలో ప్రకటన చేస్తానని తెలిపారు.

మరోవైపు, ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సాధారణంగానే కనిపిస్తున్నప్పటికీ… రానున్న రోజుల్లో ఇరాన్ పై తీవ్రస్థాయిలో ప్రతీకార దాడులను అమెరికా చేయవచ్చని, విరుచుకుపడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/