ఐపిఒకు డేటింగ్‌ యాప్‌ రెడీ

త్వరలో పబ్లిక్‌ ఇష్యూకు

ipo-Dating app ready
ipo-Dating app ready

ముంబై: అమెరికాకు చెందిన డేటింగ్‌యాప్‌ బంబుల్‌, త్వరలో దేశీయంగా పబ్లిక్‌ ఇష్యూకు రాబోతోంది. పబ్లిక్‌ఇష్యూను జారీ చేయడానికి సిద్ధమవుతోంది. ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపిఒ) జారీచేయనున్నట్లు రెగ్యులేటరీ వద్ద దరఖాస్తులను దాఖలు చేసింది.

ఇప్పటికే అమెరికా స్టాక్‌ ఎక్ఛేంజ్‌ల్లో ఎంట్రీ ఇచ్చిన బంబుల్‌ ఇంటర్నేషనల్‌ కార్పొరేషన్‌ అద్భుత ఫలితాలను సాధించింది. గత ఏడాది మొత్తానికి 168 బిలియన్‌ డాలర్లను సమకూర్చుకుంది. దేశీయ ఐపిఒ మార్కెట్లో అడుగుపెట్టడానికి ఉవ్విళ్లూరుతోంది. డేటింగ్‌కు సంబంధించిన ఓ యాప్‌ దేశీయ ఐపిఒ మార్కెట్లో ప్రవేశించబోతోండడం ఇదేతొలిసారి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్‌ గ్రూప్‌కు చెందిన బంబుల్‌ ఇంటర్నేషనల్‌ కార్పొరేషన్‌ కొన్నేళ్లుగా అద్భుత యుఎస్‌ ఎక్ఛేంజ్‌లో మెరుగైన ఫలిఆలను నమోదు చేస్తోంది. 2019లో 488.9మిలియన్‌ డాలర్ల రెవెన్యూను సాధించింది.

మరుసటి ఏడాది నాటికి ఆ మొత్తం భారీగా పెరిగింది. జనవరి 29 నుంచి సెప్టెంబరు 30 మధ్యకాలంలో 376.6మిలియన్‌ డాలర్లను ఆర్జించింది. ఏడాది ముగిసే సరికి ఈ మొత్తం 168 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. నిలకడగా ఆదాయాన్ని ఆర్జిస్తుండడం వల్ల అందరి కళ్లూ ఈ యాప్‌ పబ్లిక్‌ఇష్యూ మీదే నిలిచాయి. ఎలాంటి ఐపిఒను ప్రకటిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటింగ్‌ యాప్‌లతో పోల్చుకుంటే కొంత భిన్నంగా ఉంటుంది ఇది. మహిళలు మాత్రమే దీన్ని వినియోగించుకునే అవకాశం ఉంది. డేటింగ్‌ యాప్‌లో సమాచారాన్ని పోస్ట్‌ చేయాలన్నా, స్వీకరించాలన్నా అది మహిళలకు మాత్రమే సాధ్యపడుతోంది.

పబ్లిక్‌ ఇష్యూను ఎప్పుడు జారీచేస్తుందనేది స్పష్టంగా తెలియరాలేదు. అయినప్పటికీ, ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 14వ తేదీన ఐపిఒను జారీచేస్తుందని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/