ఐపీఎల్‌ ప్రసారాలు పాకిస్థాన్‌లో నిషేధం

Imran Khan

ఇస్లామాబాద్‌: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) వల్ల పాకిస్థాన్‌ క్రికెట్‌కు హాని ఉందని అందుకే పాకిస్థాన్‌లో ఐపీఎల్‌ ప్రసారాలను నిషేధిస్తున్నామని ఆ దేశ సమాచార శాఖ తెలిపింది. మంగళవారం ఐపీఎల్‌ ప్రసారాలను నిషేధిస్తూ పాకిస్థాన్‌ నిర్ణయం తీసుకంది. ఈసందర్భంగా సమాచార శాఖ మంత్రి ఫవాద్‌ మీడియాతో మాట్లాడుతు ఆ నిర్ణయం పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తీసుకున్నదేనని ఫవాద్‌ తెలిపారు. పాకిస్థాన్‌ క్రికెట్‌కు హానీ చేసే అవకాశం భారత్‌ ఇవ్వకూడదన్న ఆలోచనతోనే మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. పాకిస్థాన్‌ క్రికెట్‌ను దెబ్బతీయాలన్న ఆలోచనతోనే భారత్‌.. ఐపీఎల్‌ ప్రసారాలను పాకిస్థాన్‌లో సైతం మొదలు పెట్టిందన్నారు. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌కు హాని చేయాలని భారత్‌ చూస్తోందని ఆరోపించారు. ఇప్పటి నుంచి పాకిస్థాన్‌లో ఒక్క ఐపీఎల్‌ మ్యాచ్‌ కూడా ప్రసారం చేయవద్దని పాకిస్థాన్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా రెగ్యూలేషన్‌ అథారిటీ(పెర్మా)కి ఆయన ఆదేశాలు జారీ చేశారు. పాకిస్థాన్‌ క్రీడలను, కళలను ఆదరిస్తుంది.. కానీ క్రీడాకారులు, కళాకారులకు హాని కలిగించేలా ఉంటే చూస్తూ ఊరుకోమన్నారు.


మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/