సత్తా తగ్గని ధోనీ.. ఐదు బంతుల్లో ఐదు సిక్సులు

MS Dhoni
MS Dhoni

చెన్నై: ఎంఎస్‌ ధోనీ ప్రపంచ క్రికెట్‌ అభిమానుల్లో పరిచయం అవసరం లేని పేరు. అయితే గత కొంతకాలంగా క్రికెట్‌కు ధోనీ దూరంగా ఉన్నాడు. తాజాగా ఈ మధ్యే మార్చి 29న ఐపిఎల్‌ 13వ సీజన్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఐపిఎల్‌ కోసం ధోనీ ఇప్పటి నుంచే ప్రాక్టీసు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ధోనీ బంతిని అలవోకగా బౌండరీ అవతలికి తరలించడంలో సిద్ధహస్తుడు. తనలో సత్తా ఏ మాత్రం తగ్గలేదని ధోనీ నిరూపించాడు. నిన్న నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూ వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాది ‘ఔరా’ అనిపించాడు. ధోనీ విశ్వరూపాన్ని స్టార్ స్పోర్ట్స్ తమిళ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. కాసేపట్లోనే ఈ వీడియో వైరల్ గా మారింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/