2020 ఐపీఎల్ షెడ్యూల్ విడుదల

ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్-13కు సంబంధించిన లీగ్ దశ షెడ్యూల్ విడుదల అయింది. బీసీసీఐ కార్యదర్శి ‘జై షా’ అధికారిక షెడ్యూల్‌ను ప్రకటించారు. మార్చి 29వ తేదీన ఐపీఎల్ ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ ఆడుతుంది. మే 24వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనున్నది. ఈ సీజన్‌లో కేవలం ఆరు మ్యాచ్‌లు మాత్రమే మధ్యాహ్నం జరగనున్నాయి. మొత్తం 57 రోజుల పాటు ఐపీఎల్ టోర్నీ ఉంటుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/