ఐపిఎల్ షెడ్యూల్ విడుదల

ముంబై: ఐపిఎల్ 2019 షెడ్యూల్ను బిసిసిఐ విడుదల చేసింది. ఐతే 17 మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ను మాత్రమే ప్రకటించారు. మొదటి మ్యాచ్లో ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, కోహ్లి కెప్టెన్సీలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ తలపడనున్నాయి. మార్చి 23న టోర్నీ ప్రారంభం అవుతుంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తొలి రెండు వారాల షెడ్యూల్నున మాత్రం బోర్డు విడుదల చేసింది. ఈ రెండు వారాల్లో మొత్తం 17 మ్యాచ్లు జరగనున్నాయి. మిగతా షెడ్యూల్ను లోక్సభ ఎన్నికల అనంతరం విడుదల చేసే అవకాశం ఉంది.
