రికార్డులు సాధించిన రోహిత్‌ శర్మ, మిశ్రా


న్యూఢిల్లీ: ఫిరోజ్‌షా కోట్లా మైదానం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య గురువారం రాత్రి జరిగిన మ్యాచులో అరుదైన రికార్డులు నమోదయ్యాయి. ముంబై ఇండియన్స్‌ సారథి రోహిత్‌శర్మ 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద 8000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. టీ20ల్లో 8 వేల పరుగులు చేసిన మూడో భారత బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ. అంతకుముందు సురేశ్‌రైనా, కోహ్లి ఈ ఘనత సాధించారు. ప్రపంచంలో అందరికన్నా ముందుగా 12 వేల పరుగులు చేసి క్రిస్‌ గేల్‌ అందరికంటే ముందున్నాడు. టి20 ఫార్మాట్‌లో రోహిత్‌ 307 మ్యాచుల్లో 8,018 పరుగులు చేశాడు.
మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్నర్‌ అమిత్‌మిశ్రా ఖాతాలో మరో ఘనత చేరింది. ఐపిఎల్‌లో 150 వికెట్లు తీసిన మొదటి భారత బౌలర్‌గా మిశ్రా రికార్డు సృష్టించాడు. మిశ్రా రికార్డు సృష్టించాడు. మిశ్రా తీసిన 150వ వికెట్‌ రోహిత్‌దే కావడం విశేషం. రోహిత్‌, మిశ్రా ఇద్దరూ తొలుత దెక్కన్‌ ఛార్జర్స్‌కు ఆడిన వారు కావడం విశేషం.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/