సుప్రీం కోర్టును ఆశ్రయించిన చిదంబరం

Chidambaram
Chidambaram

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్నిఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో సీబీఐ అధికారులు ఆగస్టు 21న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న చిదంబరానికి సెప్టెంబర్ 5న కోర్టు జ్యూడీషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ సోమవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. చిదంబరానికి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారనే సీబీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు.. ఆయన బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. చిదంబరం పిటిషన్‌ను స్వీకరించిన ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. బెయిల్‌పై నిర్ణయాన్ని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోయ్ వెల్లడిస్తారని తెలిపింది.


తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/