‘తానా’ బాలోత్సవం-2020 పోటీల ఆహ్వానం

చిన్నారుల ప్రతిభను వెలికితీసే విధంగా అమెరికాలోని నగరాల్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో తానా బాలోత్సవం-2020 పేరుతో వివిధ పోటీలను నిర్వహిస్తున్నారు.

Tana Balotsavam -2020 Invitation

తానా అధ్యక్షుడు జయ్‍ తాళ్ళూరి భద్రాచలంలో నిర్వహించిన బాలోత్సవ్‍ తరహాలోనే అమెరికాలో కూడా బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

వచ్చే సంవత్సరం తానా నిర్వహిస్తున్న 23వ మహాసభలను పురస్కరిచుకుని ఈ పోటీలను ఏర్పాటు చేశారు. సింగింగ్‍ (సోలో), డ్యాన్సింగ్‍ (గ్రూపు, సోలో) పోటీలను నిర్వహిస్తున్నారు.

క్లాసికల్‍, ఫిల్మీ, జానపదం విభాగంలో జరిగే ఈ పోటీలను మూడు విభాగాలుగా వర్గీకరించారు. 5-8 వయస్సు ఉన్నవారికి సబ్‍ జూనియర్స్, 9-13 వయస్సు ఉన్నవారికి జూనియర్స్, 14-18 వయస్సు ఉన్నవారికి సీనియర్స్ విభాగంలో ఈ పోటీలు జరుగుతాయి.

మోనో యాక్షన్‍, పెయింటింగ్‍, పబ్లిక్‍ స్పీకింగ్‍ ఇన్‍స్ట్రుమెంట్‍, తెలుగు పద్యాలు పోటీలను కూడా ఇందులో భాగంగా ఏర్పాటు చేశారు.

ఈ పోటీలను కూడా మూడు విభాగాలుగా వర్గీకరించి నిర్వహిస్తున్నారు. 5-8 వయస్సు ఉన్నవారికి సబ్‍ జూనియర్స్, 9-13 వయస్సు ఉన్నవారికి జూనియర్స్, 14-18 వయస్సు ఉన్నవారికి సీనియర్స్ విభాగంలో ఈ పోటీలు జరుగుతాయి.

అమెరికాలోని వివిధ నగరాల్లో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. న్యూజెర్సిలో ఏప్రిల్‍ 25న, ఫిలడెల్ఫియాలో జూలై 25న పోటీలు జరుగుతాయి. మిగతా నగరాల్లో కూడా ఈ పోటీలు జరుగుతాయి. త్వరలోనే ఈ నగరాలకు సంబంధించిన తేదీలు ప్రకటించనున్నారు.

ఈ పోటీలకు సంబంధించి మరిన్ని వివరాలకోసం : తానా కల్చరల్‍ కో ఆర్డినేటర్‍ సునీల్‍ పంత్ర (248 469 2349), బాలోత్సవం చైర్‍ రేఖా ఉప్పలూరి (703 340 0873)ని సంప్రదించవచ్చు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/