‘ఆటా’మహా సభలకు రావాలని కిషన్ రెడ్డికి ఆహ్వానం

అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు భువనేష్‍ బుజాల

ATA President Bhuvanesh and others met Union Minister Kishan Reddy
ATA President Bhuvanesh and others met Union Minister Kishan Reddy

వాషింగ్టన్‍ డీసీలో వచ్చే ఏడాది జూలై 1-3 తేదీల్లో అమెరికా తెలుగు సంఘం 17వ మహాసభలకు రావాల్సిందిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సంఘం ఆహ్వానించింది. వివరాలు ఇలా ఉన్నాయి. అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు భువనేష్‍ బుజాల తన ఇండియా పర్యటనలో భాగంగా న్యూఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్‍ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి మహా సభల ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం అమెరికా తెలుగు సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. పలువురు ఆటా నాయకులు పాల్గొన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/