రిలయన్స్ షేర్లపై ఇన్వెస్టర్లకు తగ్గుతున్న ఆసక్తి
రైతు వ్యతిరేక చట్టం సంస్థకే లాభమన్నచర్చ ప్రభావం..

ముంబై: 2020 కరోనా సంవత్సరం అయినా కూడా స్టాక్ మార్కెట్లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదు. ఈక్విటీలు ఇన్వెస్టర్లకు పంటపండించాయి. ప్రతికూల వాతావరణంలో కూడా సానుకూలంగా మలు చుకుని కంపెనీలు, ఇన్వెస్టర్లు లాభపడ్డారు. ఇందులో రిలయన్స్ కూడా ఒకటి.
2020 సెప్టెంబర్ మధ్య వరకు రిలయన్స్ కంపెనీకి స్వర్ణయుగమే. కంపెనీలోని డిజిటల్ ఫ్లాట్‌ఫాం అయిన జియోతోపాటు రిలయన్స్ రిటైల్‌లో భారీగా పెట్టుబడులు వచ్చాయి. సుమారు రూ.2లక్షల కోట్లు పంప్చేశాయి కంపెనీలు.
దీంతో స్టాక్ మార్కెట్లో షేరుకు భారీగా డిమాండ్ పెరిగింది. కంపెనీ షేరు ఏకంగా రూ.2324వద్ద ట్రేయింది. అయితే సెప్టెంబరు తర్వాత కంపెనీ స్టాక్ ఇన్వెస్టర్లకు అంతగా కలిగిరాలేదు. కారణాలు ఏమైనా తర్వాత కాలంలో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు రెడీఅయ్యారు.
దీంతో స్టాక్ విలువ గత మూడు నెలల్లో 17శాతం నష్టపోయింది. నిజానికి ఇదే కాలానికి నిఫ్టీ 50 మాత్రం 24 శాతం పెరిగింది. రిలయన్స్ సంస్థ షేరు ఆకట్టు కోలేకపోవడానికి రకరకాల కారణాలున్నాయి. కంపెనీ ఆదాయాలు పెద్దగా లేకపోయినా కూడా పెట్టుబడుల రాకతో షేరు ధర పెరిగింది.
కేవలం వాటి వల్లే భారీగా పెరిగింది. దీంతో సహజంగానే కొంతకాలానికి ముఖ్యంగా సెప్టెంబర్ త్రైమాసికం ఫలితాల తర్వాత ఇన్వెస్టర్లు అంతగా సుముఖంగా లేరు. మొదట్లో జియో ర్యాలీతో ప్రత్యర్థి కంపెనీలు అతలాకుతలం అయ్యా యి.
కానీ ఇప్పుడు జియోకు అసలైన పోటీ మొదలైంది. ఎయిర్టెల్ కంపె నీ జియోకు గట్టిపోటీనిస్తోంది. 2020 జూన్ త్రైమాసికంలో జియో విని యోగదారుల బేస్ 10.2మిలియన్లుగా ఉంటే, సెప్టెంబర్ త్రైమాసికానికి ఇది 7.3మిలియన్లకు పడిపోయింది.
అదే సమయంలో ఎయిర్టెల్ కంపెనీ కస్ట మర్లు 13.9మిలియన్లకు పెరిగింది. అదేవిధంగాఎయిర్టెల్ షేరు అక్టోబర్ నాటికి 52శాతం పుంజుకుంది. జియో తగ్గుముఖం పట్టింది. దీనికి తోడు రిలయన్స్సంస్థకి రైతుల ఆందోళన కూడా ఇబ్బందిగా మారింది. రైతు వ్యతిరేక చట్టం రిలయన్స్ సంస్థకే లాభమన్నచర్చ కూడా ఈ కంపెనీపై ప్రభావం చూపింది.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/