ఇపుడు భారత్‌లో పెట్టుబడులు కష్టమే!

WISDOM TREE-
WISDOM TREE-

ముంబై: సుదీర్ఘకాలంగా ఇండియా పై బుల్లిష్‌గా ఉంటూ చాలా కాలంగా దేశీయ స్టాకులకు రికమండ్‌ చేస్తూ, 2018 మార్కెట్‌ నష్టాల్లో కూడా దేశీయ మార్కెట్‌పై పాజిటివ్‌గా ఉన్న విజ్‌డమ్‌ట్రీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ తాజాగా దేశీయ మార్కెట్‌పై బేరిష్‌గా మారింది. భారత వృద్ధి పై విశ్వాసం ఉందని, కానీ దేశీయంగా రేకెత్తిన రాజ కీయ, సాంఘీక టెన్షన్లు ఆర్థిక వృద్ధిని మరింత వర్తింపచేస్తాయని అభిప్రాపడింది. ఇదే సంస్థ వాణిజ్య యుద్ధం సమయంలో భారత్‌ను సురక్షిత పెట్టుబడుల స్థానంలో అభివర్ణించింది. కానీ ప్రస్తుతం భారత మార్కెట్‌లో పెట్టుబడులకు విబేధాలు తెస్తున్నాయని సంస్థ వెల్లడించింది.

హిందూ, ముస్లిం మధ్య ఉద్రిక్తలు పెరుగుతు న్నాయని, 2020లో రికవరీ చాలా నెమ్మదిగా ఉండొచ్చని తెలిపింది. పైగా దేశీయస్టాకుల భారీ విలువ ప్రస్తుత మౌలిక పరిస్థితులకు తగ్గట్టుగా లేవని, దశాబ్దకాలంగా వీటి ఇపిఎస్‌లు ఫ్లాట్‌గా ఉన్నాయని తెలిపింది. విజ్‌డమ్‌ట్రీ కంపెనీ ఎయుఎం విలువ దాదాపు 6400కోట్ల డాలర్లు. దేశీయ వృద్ధి ఇటీవల కాలంలో తగ్గుదల నమోదు చేయడంతో పలు సంస్థలు దేశీయ జిడిపి అంచనాలను తగ్గిస్తూ వస్తున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/