నీరవ్‌ సోదరుడిపై రెడ్‌కార్నర్‌ నోటీస్‌!

red carner
red carner


న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌బ్యాంకులో 13వేల కోట్ల రుణపరపతి కుంభకోణాలకు సంబంధించి నిందితునిగా ఉన్న వజ్రాభరణాల వ్యాపారి నీరవ్‌మోడీ సోదరుడు నేహాల్‌మోడీ కోసం ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీస్‌ జారీ చేసింది. బెల్జియం దేశస్తునిగా ఉన్న 40ఏళ్ల నేహాల్‌పై గ్లోబల్‌ అరెస్టు వారంట్‌ జారీ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ప్రకటించారు. ఈ కేసులో మనీలాండరింగ్‌ అభియోగాలపై ఇడి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. నేహాల్‌ దీపఖ్‌మోడీ బెల్జియంలోని యాంట్వెర్ప్‌లో జన్మించారు. ఆయనకు ఇంగ్లీషు, గుజరాతి, హిందీ భాషలు వచ్చని రెడ్‌కార్నర్‌ నోటీస్‌లో వివరించారు. ఇడి అధికారులు దాఖలు చేసిన ఛార్జిషీటులో నేహాల్‌ మోడీపేరును కూడా చేర్చారు. అంతేకాకుండా ఆయన సాక్ష్యాలను తారుమారు చేసేందుకు కుట్రలు చేసారని ఆరోపించింది. నీరవ్‌మోడీతో పాటు ఆయన మేనమామ మెహుల్‌చోక్సీని కూడా ఈ భారీ కుంభకోణంలో ప్రధాన సూత్రదారులు, నిందితులుగా ఇడి, సిబిఐ దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. సుమారు 14వేల కోట్లమేరకు తమ బ్యాంకు నష్టపోయిందని పంజాబ్‌నేషనల్‌బ్యాంకు వెల్లడించింది.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/business/