తెలంగాణలో కొన్ని చోట్ల ఇంటర్నెట్‌ నిలిపివేత

Internet blackouts
Internet blackouts

హైదరాబాద్‌: తెలంగాణలో కొన్ని చోట్ల ఇంటర్నెట్‌ను ఆపేశారు. నిన్న రాత్రి భైంసాలో చోటుచేసుకున్న మత ఘర్షణల నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. రాత్రి జరిగిన ఈ ఘటనలో 11 మంది గాయపడ్డట్లు తెలిసింది. కొన్ని వాహనాలను తగులబెట్టి, ఇళ్లపై కొందరు దాడిచేశారు. దీని ప్రభావంతో రెండు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తి తీవ్రస్థాయికి చేరే అవకాశం ఉందని, ముందస్తు చర్యగా ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేశారు. అంతేకాదు.. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. ఈ నెల 16వ తేదీ వరకు ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరణ కాబోవని టెలికం సంస్థలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/