విద్రోహ శక్తులు..ఇంటర్నెట్​పై ఆంక్షల పొడిగింపు

జమ్మూ కశ్మీర్​లో ఇంటర్నెట్‌పై ఆంక్షలు మార్చి నాలుగో తేదీ వరకూ కొనసాగించాలని నిర్ణయం

internet
internet

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌‌లో ఇంటర్నెట్‌పై ఆంక్షలు మరికొంత కాలం కొనసాగనున్నాయి. వచ్చే నెల నాలుగో తేదీ వరకు ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు ఉంటాయని ఆ రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. ఇంటర్నెట్‌ను దేశ సరిహద్దుల్లోని విద్రోహ శక్తులు దుర్వినియోగం చేస్తూ జమ్మూ కశ్మీర్‌‌లో ఉగ్రదాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్టు గుర్తించామని తెలిపారు. అలాగే, గత వారం రోజులుగా జరుగుతున్న ఉగ్ర కార్యకలాపాలతో పాటు రాష్ట్రంలో అశాంతిను రేపడానికి జరుగుతున్న ఆందోళనల దృష్ట్యా కశ్మీర్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్‌ను కూడా నిలిపివేసినట్టు రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ షాలీన్ కబ్రా పేర్కొన్నారు. దేశ, రాష్ట్ర ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/