మళ్లీ అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాలపై విధించిన నిషేధాన్ని భారత్‌ మరోసారి పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాల రాకపోకలపై నిషేధం అమలులో ఉంటుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సోమవారం తెలిపింది. అయితే అంతర్జాతీయ కార్గో విమానాలు, డీజీసీఏ అనుమతించిన విమానాలు, బబుల్‌ విమాన సర్వీసులపై ఈ నిషేధ ప్రభావం ఉండదని పేర్కొంది. గత ఏడాది నవంబర్‌ 26 నాటి సర్క్యులర్‌ను పాక్షికంగా సవరించినట్లు తెలిపింది. ఈ మేరకు డీజీసీఏ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020 మార్చి 23న విధించిన అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాల రాకపోకలపై నిషేధం కొనసాగుతున్నది. అయితే కొన్ని దేశాలతో కుదిరిన బబుల్‌ ఒప్పందం మేరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. మరోవైపు దేశంలో కరోనా కేసులు చాలా వరకు తగ్గాయి. అయితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణపై ప్రభావం చూపింది. దీంతో తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు డీజీసీఏ తెలిపింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/