ప్రాణాలతో ఉన్నంత కాలం తెలుగు భాష కోసం కృషి

తెలుగు మాట్లాకుండా మేధావులు కాలేరు

vidyasagar rao
vidyasagar rao

హైదరాబాద్‌: ప్రాణాలతో ఉన్నంత కాలం తెలుగు భాషను కాపాడే విధంగా కృషి చేస్తానని మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు అన్నారు. అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవం సందర్భంగా బేగంపేట హరిత ప్లాజాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలుగు మాట్లకుండా మేధావులు కాలేరని అన్నారు. మాతృభాష మాట్లాడి, కాపాడుకొని బంగ్లాదేశ్‌ ఒక దేశంగా ఏర్పడిందని వివరించారు. తెలుగు ప్రాచీన భాష హోదా పొందిందని, ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా వారి మాతృభాషను కాపాడుకోవాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం నిర్వహించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి మాట్లాడుతూ..అంతరించి పోయే భాషలు ఉన్నాయనే యునెస్కో మాతృభాష దినోత్సవాన్ని ఏర్పాటు చేసిందని అన్నారు. ఇంగ్లీష్‌ చదువుకుంటే ఉద్యోగాలు దొరుకుతాయి అంటారు..కానీ తెలుగులో చదివి కూడా ఐఏఎస్‌లుగా ఎంపికయ్యారని వ్యాఖ్యానించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/