ధోనిపై ఆర్పిసింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

వ్యూహాలు అమలు చేయడంలో మహీని మించిన వారు లేరు: ఆర్పి

rp singh
rp singh

న్యూఢిల్లీ: భారత మాజి కెప్టెన్‌ మహెంద్రసింగ్‌ ధోనిపై, భారత మాజి బౌలర్‌ ఆర్‌పి సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆటను అర్ధం చేసుకోవడంలో ధోనిని మించిన వారు లేరని అన్నాడు. తాజాగా భారత మాజి క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రాతో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ లో పాల్గోన్న ఆర్పి పలు విషయాలను వెల్లడించాడు. ఆటను అర్ధం చేసుకోవడంలొ ధోనిని మించిన కెప్టెన్‌ని నేను చూడలేదని, మైదానంలో ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఉన్న తనవైపు మళ్లించుకోవడం.. అందుకు తగ్గ వ్యూహలు అమలు చేయండంలో మహీ కన్నా గొప్పవారిని నా కేరిర్‌లోనే చూడలేదని, పరిస్థితులను చాలా భిన్నంగా చూస్తాడని ఆర్పి చెప్పుకొచ్చాడు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/