విజయసాయిరెడ్డి పై వర్ల ఆసక్తికర వ్యాఖ్యలు

సీబీఐ, ఈడీ కేసుల్లో విజయసాయి ప్రధాన ముద్దాయి అన్న వర్ల

varla ramaiah
varla ramaiah

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి న్యాయవ్యవస్థ పారదర్శకంగా వ్యవహరించడం లేదని చేసిన వ్యాఖ్యలపై టిడిపి నేత వర్ల రామయ్య ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 11 సీబీఐ కేసులు, 5 ఈడీ కేసుల్లో ప్రధాన ముద్దాయిగా ఉన్న వ్యక్తి విజయసాయి అని పేర్కొన్నారు. ఈ కేసుల్లో కండిషనల్ బెయిల్ పై బయటకు వచ్చిన విజయసాయి… ఏకంగా పార్లమెంటులో న్యాయ వ్యవస్థను కించపరిచే వ్యాఖ్యలు చేశారని… ఇలా వ్యవహరించినందుకు అత్యున్నత న్యాయస్థానం అతని బెయిల్ రద్దు చేసి, నోరు అదుపులో పెట్టుకోమని చెప్పొద్దూ అని అన్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/