పోస్టాఫీసు పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను పెంచిన కేంద్రం

జనవరి 1 నుంచి అమల్లోకి కొత్త రేట్లు

interest-rates-on-post-office-deposits-savings-certificate-raised-interest-rates-on-post-office-deposits-savings-certificate-raised

న్యూఢిల్లీః చిన్న మొత్తాల పొదుపు పథకాలలో (పోస్టాఫీసు పథకాలు) ఇన్వెస్ట్ చేసే వారికి కేంద్ర సర్కారు తీపి కబురు చెప్పింది. వడ్డీ రేట్లను 1.1 శాతం వరకు పెంచింది. జనవరి 1 నుంచి నూతన రేట్లు అమల్లోకి వస్తాయి. మూడు నెలల పాటు, 2023 మార్చి వరకు ఇవే కొనసాగుతాయి. ప్రతి మూడు నెలలకు రేట్లను సవరించే విధానం అమల్లో ఉంది.

పోస్టాఫీసు సేవింగ్స్ డిపాజిట్ రేటులో ఎలాంటి మార్పు లేకుండా 4 శాతంగానే ఉంది. అలాగే ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ (5.8 శాతం), పీపీఎఫ్ (7.1 శాతం), సుకన్య సమృద్ధి యోజన (7.6) పథకాలపై రేట్లను పెంచకుండా ప్రస్తుతం అమల్లో ఉన్న రేట్లను కొనసాగించింది. ప్రస్తుత రేటు ప్రకారం కిసాన్ వికాస పత్రలో పెట్టుబడి 123 నెలలకు డబుల్ అవుతుంటే, కొత్త రేటు ప్రకారం 120 నెలలకే డబుల్ కానుంది.

ఏడాది టైమ్ డిపాజిట్
5.5 -ప్రస్తుత రేటు
6.6 -కొత్త రేటు
రెండేళ్ల టైమ్ డిపాజిట్
5.7 6.8
మూడేళ్ల టైమ్ డిపాజిట్
5.8 -ప్రస్తుత రేటు
6.9-కొత్త రేటు
ఐదేళ్ల టైమ్ డిపాజిట్
6.7-ప్రస్తుత రేటు
7-కొత్త రేటు
సీనియర్ సిటిజన్ స్కీమ్
7.6-ప్రస్తుత రేటు
8-కొత్త రేటు
మంత్లీ ఇన్ కమ్ స్కీమ్
6.7 7.1
ఎన్ఎస్ సీ
6.8-ప్రస్తుత రేటు
7-కొత్త రేటు
కిసాన్ వికాస్ పత్ర
7-ప్రస్తుత రేటు
7.2-కొత్త రేటు
సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్
4 4

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/telangana/