రేపు ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Results
Results

హైదరాబాద్‌: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ శుక్రవారం రాత్రి ట్వీటర్‌ ద్వారా తెలిపారు. 15వ తేదీలోపు ఇంటర్‌ ధ్రువపత్రాలు సమర్పించాలన్న షరతుపై పలువురు తెలంగాణ విద్యార్థులకు ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు సీట్లు ఇచ్చాయని, అయితే ఇప్పటివరకు ఇంటర్‌ ఫలితాలు రాకపోవడంతో సీట్లు కోల్పోతారని అంతా ఆందోళన చెందుతున్నారని ఓ విద్యార్థి తల్లి కేటీఆర్‌కు ట్విటర్‌లో విన్నవించారు. దీనికి స్పందించిన ఆయన ఫలితాల వెల్లడిపై విద్యాశాఖ మంత్రి, కార్యదర్శితో మాట్లాడతానని పేర్కొన్నారు. అనంతరం కొద్దిసేపటికి ఈ నెల 14న ఫలితాలు ఇస్తున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఇప్పుడే చెప్పారని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/