ఈ నెల 7 నుంచే ఇంటర్ సప్లిమెంటరీ

హైదరాబాద్: వరంగల్లో ఇంటర్ ప్రశ్నాపత్రాలు గల్లంతు వ్యవహారంలో విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ చెప్పారు. ఈ నెల 7 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. పోలీస్స్టేషన్లో భద్రపరచిన ప్రశ్నాపత్రాలు గల్లంతయ్యాయని..ఆ రెండు పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మరో సెట్ ప్రశ్నాపత్రాలు పంపిస్తున్నామని చెప్పారు. పరీక్షల షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండవని..యథావిధిగా జరుగుతాయని అశోక్ తెలిపారు.
వరంగల్ పోలీస్స్టేషన్లో భద్రపరచిన 13 సీల్డు బాక్సుల్లో రెండు బాక్సులు మాయమయ్యాయి. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తాజా హీరోయిన్ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/