ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు

Inter exam
Inter exam

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును మరోసారి పొడిగించారు. అయితే ఫీజు చెల్లింపునకు గడువు ఈరోజుతో ముగియనున్నపటికి విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు మరో రెండు రోజులు ఫీజు చెల్లింపు గడువు పెంచుతున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ వెల్లడించారు. అదేవిధంగా ఈ నెల 26, 27 తేదీల్లో పలు పోటీ పరీక్షలు ఉన్నందున ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలులో మార్పు చేయాలంటూ వస్తోన్న విజ్ఞప్తుల నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను పునఃసమీక్షించి త్వరలోనే సప్లిమెంటరీ పరీక్షల తేదీలను కూడా ఖరారు చేస్తామని అశోక్‌ ఓ ప్రకటనలో తెలిపారు.


మరిన్ని తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/