ఇద్దరు వాటెండ్‌ క్రిమినల్స్‌ అరెస్ట్‌

arrested
arrested

మంచిర్యాల: మంచిర్యాల పట్టణ పోలీసులు ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్‌ చేశారు. నిందితులు ఇద్దరు కూడా మందమర్రికి చెందిన టేకం రాము(24), పెద్దపల్లి జిల్లా బోగంపల్లి గ్రామానికి చెందిన రాంటెంకి సారయ్య(22)గా గుర్తించారు. వీరి వద్ద నుంచి 74.42 తులాల బంగారం, కిలోన్నర వెండి, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే దొంగలిద్దరూ కూడా మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్‌, వరంగల్‌, భూపాలపల్లి పోలీసులకు వాటెండ్‌ క్రిమినల్స్‌గా ఉన్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/