నేటి నుండి ఇంటర్‌ పరీక్షలు

INTER EXAMS
INTER EXAMS

అమరావతి: ఏపిలో ఈరోజు నుండి ఇంటర్మీడియట్‌ పరీక్ష ప్రారంభమైనవి. ఇంటర్మీడియట్‌ పరీక్షల విధులు నిర్వర్తించే పర్యవేక్షకులు, సిట్టింగ్‌ స్క్వాడ్ల సహా ఫ్లయింగ్‌ స్క్వాడ్లు సైతం పరీక్షలు ముగిసే వరకు సెల్‌ఫోన్లు వాడరాదని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశించారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు నేటి నుండి మొదలవుతున్న నేపథ్యంలో మంత్రి ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌తో సమీక్షించారు. వాట్సాప్‌ ద్వారా గందరగోళం ఏర్పడే అవకాశం ఉన్నందున సిబ్బంది మొబైల్‌ ఫోన్‌ వాడకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. జిరాక్స్‌ కేంద్రాలపై నిఘా ఉంచాలన్నారు. మార్చి 18 వరకు ఇంటర్‌ పరీక్షలు జరనున్నాయి.