డ్రైనేజీలో ఇంటెలిజెన్స్ ఉద్యోగి మృతదేహం
శర్మ శరీరంపై బుల్లెట్ గాయాలు

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యలో అంకిత్ శర్మ అనే ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగిని హతమార్చిన దుండగులు… ఆయన శవాన్ని ఓ డ్రైనేజ్ కాలువలో పడేశారు. నగరంలోని చాంద్ బాగ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేరిన శర్మ… డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా విధులు నిర్వహించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా అల్లరిమూక శర్మపై దాడిచేశారని అనుమానిస్తున్నారు. ఆయనను హతమార్చి, పక్కనే ఉన్న మురికి కాల్వలో పడేసింది. అతని శరీరంపై బుల్లెట్ గాయాలు ఉన్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. మరోవైపు, అంకిత్ శర్మ హత్య నేపథ్యంలో ఢిల్లీలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఢిల్లీ హింస అయిదో రోజుకు చేరుకున్నది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/