వాట్సప్‌ కస్టమర్లకు బీమా సేవలు రెడీ

ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి..

WhatsApp customers
WhatsApp customers

ముంబై: ఇటీవలే నగదు చెల్లిం పులను అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సప్‌, తమ యాప్‌ ద్వారానే ఆరోగ్య బీమా పాలసీలను కూడా తీసుకునే సౌలభ్యాన్ని కూడా కల్పిం చనుంది. ఈ ఏడాదిచివరి నాటికి ఇన్సూ రెన్స్‌ సేవలను అందుబాటులోకి తేనుంది.

ఆరోగ్య బీమా కోసం ఎస్‌బిఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌తో వాట్సప్‌ జత కట్టింది. పెన్షన్‌ సేవల కోసం హెచ్‌డి ఎఫ్‌సి పెన్షన్స్‌, పిన్‌బాక్స్‌ సొల్యూషన్స్‌తో వాట్సప్‌ కలిసి పనిచేస్తోంది. ఎడ్‌-టెక్‌, అగ్రి-టెక్‌ల్లోనూ ఇదే తరహా పైలట్‌ ప్రాజెక్టులను వాట్సప్‌ చేపట్టనుంది.

సూక్ష్మ రుణాలు, పెన్షన్లు ఇతర ప్రొడక్టుల కోసం వాట్సప్‌ ఆర్థిక సేవల రంగంలోని భాగస్వాములతో కలిసి పని చేస్తుందని ఈ ఏడాది ఆరంభంలో ఒక పత్రిక ద్వారా వెల్లడైంది. రోజుకు రూ.50 కంటే తక్కువ మొత్తంతో స్వయం ఉపాధి పొందు తున్న 300 మిలియన్ల మందికి పెన్షన్‌ సదు పాయాన్ని కల్పించే ప్రయత్నాల్లో ఉన్నట్లు వాట్సప్‌ ఇండియా తెలిపింది.

యుపిఐలను నిర్వహించే నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా 20 మిలియన్ల మంది యూజర్లకు పేమెంట్‌ సేవలు అందించేలా వాట్సప్‌కు నవంబర్లో అనుమతులు ఇచ్చిన సంగతి విదితమే. యుపిఐ కోసం ఎస్‌బిఐ, ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్‌డి ఎఫ్‌సి, యాక్సిస్‌ బ్యాంకులతో వాట్సాప్‌ జతకట్టింది.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/