ఇన్‌స్టెంట్‌ పచ్చళ్లు

రుచి: వెరైటీ వంటకాలు

chintapandu pachadi
chintapandu pachadi

చింతపండు పచ్చడి

కావల్సినవి : చింతపండు- వందగ్రాములు
బెల్లం – వందగ్రాములు, చక్కెర – నాలుగు చెంచాలు,
జీలకర్ర- అరచెంచా, సోంపు అరచెంచా,
గరంమసాలా – అరచెంచా, లవంగాలు – ఆరు,
ఉప్పు-సరిపడా, కారం – రెండు చెంచాలు
పసుపు – చిటికెడు

తయారు చేయు విధానం :

చింతపండును ముందుగా నానబెట్టుకుని ఓ గిన్నెలో చిక్కని గుజ్జు తీసుకోవాలి. అందులో బెల్లం తరుగు, తగినంత ఉప్పు, చక్కెర, పసుపు లవంగాలు వేసి పొయ్యిమీద పెట్టి బాగా ఉడికించాలి. ఇంతలో మరో బాణలిలో జీలకర్ర సోంపు వేయించుకుని మెత్తగా పొడిచేసి చింతపండు గుజ్జులో వేయాలి. రెండు మూడు నిమిషాల తరవాత కారం, గరంమసాలా వేసి బాగా కలపాలి. చింతపండు గుజ్జు ఉడికి దగ్గరపడుతున్నప్పుడు దింపేయాలి. ఇది దోశలూ, బ్రెడ్‌, రోటిలోకి చాలా బాగుంటుంది.

ఉల్లి-టొమాటో పచ్చడి

Onion- tomato chutney

కావలసినవి :
ఉల్లిపాయలు (పెద్దవి) రెండు
టొమాటో: ఒకటి,
ఎండుమిర్చి – ఐదు
వెల్ల్లుళ్లు రెబ్బలు : నాలుగు,
ఇంగువ అరటీస్పూను
ఉప్పు: టీస్పూను
నూనె : 2 టీస్పూన్లు

తయారు చేసే విధానం :

ఉల్లిపాయాలు పొట్టు తీసి ముక్కలుగా కోయాలి. టొమాటోలు కూడా ముక్కలుగా కోయాలి. బాణలిలో నూనెపోసి ఉల్లిముక్కలు వేసి వేయించాలి. ముక్కలు రంగుమారి మృదువుగా అయ్యాక ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇంగువ వేసి వేయించాలి. వెల్లుల్ని పచ్చివాసన పోయాక టొమాటో ముక్కలు ఉప్పువేసి ఉడికించాలి. టొమాటో ముక్కలు ఉడికిన తరవాత దించి చల్లారనివ్వాలి. ఆరిన తరువాత మిక్సీలో వేసి నీళ్లు లేకుండా మెత్తగా రుబ్బాలి.

ఉల్లికాడల పచ్చడి

Ullikadala Pachadi

కావల్సినవి : ఉల్లికాడలు : కట్ట, అల్లం: అంగుళంముక్క
పచ్చిమిర్చి : నాలుగు,
కత్తిమీర తురుము : 3
టేబుల్‌స్పూన్లు,
కొబ్బరి తురుము : 2 టీస్పూన్లు
సెనగపప్పు : ఒకటిన్నర టీస్పూన్లు
మినపప్పు: ఒకటిన్నర టీస్పూన్లు
నూనె : తగినంత, ఉప్పు : రుచికి సరిపడా
పోపుకోసం : ఆవాలు , సెనగపప్పు : మినపప్పు: కొద్దికొద్దిగా, కరివేపాకు : 2 రెబ్బలు

తయారుచేసే విధానం :

ఉల్లికాడలు శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి పక్కన ఉండాలి. బాణలిలో కొద్దిగా నూనెవేసి సెనగపప్పు, మినపప్పు వేయిం చాలి. తరువాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి తాలింపు పెడితే ఉల్లికాడల చట్నీ రెడీ !

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/