ఈ ప్రభుత్వాన్ని ఇన్‌సైడర్లు ఛాలెంజ్ చేస్తున్నారు
పయ్యావుల గారు చంద్రబాబు తండ్రి, తాతల ఆస్తుల గురించి మాట్లాడితే బాగుంటుంది

అమరావతి: టిడిపి నేతలపై వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వానికి కొందరు టిడిపి నేతలు సవాళ్లు విసురుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం అఖండ మెజారిటీతో గెలిపించిన వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వాన్ని ఇన్‌సైడర్లు ఛాలెంజ్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. కమీషన్ల కోసం టిడిపి మొదలు పెట్టివన్నీ కొనసాగిచాలంటున్నారు. గోబెల్స్ ప్రచారాలకు తెగబడుతున్నారని ఎంపీ దుయ్యబట్టారు. పయ్యావుల గారు తన బాస్ చంద్రబాబు నాయుడు తండ్రి, తాతల ఆస్తుల గురించి మాట్లాడితే బాగుంటందని విజయసాయిరెడ్డి సూచించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/