మృతదేహాల అప్పగింతపై విచారణ వాయిదా

సుప్రీం దృష్టికి తీసుకెళ్లాలని సూచన

High Court
High Court

హైదరాబాద్‌: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన కేసును హైకోర్టు శుక్రవారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. ఈ కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టవద్దని అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన నలుగురు నిందితుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించే అంశంపై నేడు హైకోర్టులో విచారణ జరగగా, ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని అడ్వకేట్‌ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/