సర్వత్రా ఉత్కంఠ.. పోలవరంపై విచారణ

Polavaram
Polavaram

అమరావతి: పోలవరంపై హైకోర్టు తీర్పు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పోలవరం హైడల్‌ ప్రాజెక్టుపై స్టే వెకేషన్‌ తొలగింపును వ్యతిరేకించిన నవయుగ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా గతంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీకి కూడా ధర్మాసనం నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఛీఫ్‌ జస్టిస్‌ జెకె మహేశ్వరి, జస్టిస్‌ శ్యాంప్రసాద్‌ నేత్రుత్వంలో హైకోర్టు విచారణ చేయనుంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కూడా కోర్టుకు హాజరై తమ వాదనను వినిపించనుంది. మరికాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. కాగా విచారణ ముగిసే వరకు హైడల్‌ ప్రాజెక్టు వద్ద పనులు నిలిపివేయాలని ధర్మాసనం ఆదేశించింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/