ఇన్ఫోసిస్‌ లాభాలు 16.60 % జంప్‌

మూడో త్రైమాసికంలో 5197 కోట్లకు చేరినట్లు కంపెనీ ప్రకటన

Infosys' profits jump 16.60%
Infosys’ profits jump 16.60%

న్యూఢిల్లీ,: ఇన్ఫోసిస్‌ ఆర్థిక ఫలితాలు ఈ త్రైమాసికంలో 16.60 శాతం పెరిగాయి. మూడో త్రైమాసికంలో 5197 కోట్లకు చేరినట్లు కంపెనీ ప్రకటించింది. గత ఏడాది ఇదేకాలంలో కంపెనీ 4457 కోట్లు నికరలాభాలు ఆర్జించింది. క్రమానుగతంగా చూస్తే నిరకలాభం 7.3శాతంగా పెరిగిం ది. 4845 కోట్లుగా సెప్టెంబరు త్రైమాసికంలో ప్రకటించింది. కంపెనీ రాబడులు 25,927 కోట్లు వరకూ ఉన్నాయి. గత ఏడాది 5.52 శాతంతో పోలిస్తే 12.27 శాతానికి పెరిగాయి.

మూడో త్రైమాసికంలో క్రమానుగతంగా ఎనిమిదేళ్ల గరిష్టానికి చేరింది. డాలర్‌ విలువల్లో చూస్తే రాబడులు ఈ త్రైమాసికంలో 8.4శాతంగా ఉంది. త్రైమాసికం వారీగా చూస్తే 6.2శాతం పెరిగి 3516 మిలియన్‌ డాలర్లకు పెరిగింది. సెప్టెంబరు త్రైమాసికంలో 5197 కోట్లుగా ఉంది.7.3శాతంగా పెరిగినట్లు తేలిం ది. ఇక రాబడులపరంగా ఆదాయం 6.6శాతం పెరిగింది.

డిజవిటల్‌ రాబడులు 31.3శాతం పెరిగాయి. మొత్తంగా డిజిటల్‌ రాబడులు మొత్తం ఆదాయ వనరుల్లో 50శాతాన్ని అధిగమించాయి. నిపుణుల అంచనాలను అధిగమించే ఫలితాలున్నాయి. ఫిలిప్‌ కేపి టల్‌, ఐసిఐసిఐ డైరెక్ట్‌ కంపెనీలు 15-16శాతం పెరుగుదల ఉంటుందని వెల్ల డించాయి. యాంటిక్‌ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ రాబడులు 10.1శాతంగా ఉంటుందని రాబడులు 25,420.3కోట్లువరకూ ఉంటాయని అంచనావేసింది. ఇక నిర్వహణ లాభాల పరంగాచూస్తే ఈత్రైమాసికంలో 6589 కోట్లుగా ఉంది. 30.1శాతం ఆర్షికవృద్ధిని సాధించింది.

5.8శాతం చొప్పునపెరిగి క్రమానుగతంగా 6228 కోట్లకు గత ఏడాది ఉన్నట్లు అంచనా. ఇక కొత్త ఆర్థికసంవత్సరంలో రాబడులు 4.5 నుంచి ఐదుశాతం వరకూ పెరుగుతాయని కంపెనీ ధీమాగా ఉంది. ఇక నిర్వహణ మార్జిన్‌ కూడా 24 నుంచి 24.5శాతంగా ఉండవచ్చని కంపెనీ పనితీరు మరింత పటిష్టపడుతుందని వెల్లడించింది. సిఇఒ ఎండి సలీల్‌పరేఖ్‌ మాట్లాడుతూ ఇన్ఫోసిస్‌ టీమ్‌ ఈ త్రైమాసికంలో మంచి పనితీరును చూపించడం వల్లనే ఫలితాలు మరింత మెరుగ్గా ఉన్నాయని పేర్కొన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/