ఇన్ఫోసిస్‌ సిఇఒపైనే రెండో లేఖ

నెలకు రెండు సార్లు ముంబయి-బెంగళూరు రాకపోకలు

infosys
infosys

బెంగళూరు; ఇన్ఫోసిస్‌లో అవకతవకలు భారీ ఎత్తునే సాగుతున్నాయని రెండోసారి కంపెనీలోని అదృశ్యవేగులులేఖలు ఎక్కుపెట్టారు. ఈసారి నేరుగా సిఇఒ సలీల్‌ పరేఖ్‌పైనే విమర్శలు ఎక్కుపెట్టారు. మొదటి లేఖను గతనెల 22వ తేదీ ఇవ్వడంతో కంపెనీ షేర్లు సుమారు 16శాతం క్షీణించి 643.55 వద్ద బిఎస్‌ఇలో ముగిసాయి. రెండోలేఖలో నేరుగా సిఇఒ సలీల్‌పరేఖ్‌పైనే ఆరోపణలు చేసారు. మొదటి లేఖతో వెల్లువెత్తిన విమర్శలను పరిష్కరించుకనేందుకు సతమతం అవుతున్న ఐటి సేవలసంస్థ రెండోలేఖతో మరింత ఇరుకున పడినట్లయింది. సిఇఒ సలీల్‌పరేఖ్‌ కొన్ని అవకతవకలకు పాల్పడ్డారని, అయితే అవినీత ఇక్కుకుపోయినా కంపెనీని లాభాల్లో ఉన్నట్లు చూపించి స్వల్పకాలిక లబ్దికి ప్రయత్నించారని కంపెనీ ఛైర్మన్‌ బోర్డు డైరెక్టర్లు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. పరేఖ్‌ కంపెనీలో చేరి 18 నెలలు అవుతున్నదని, బెంగళూరు కేంద్రంగానే సిఇఒ విధినిర్వహణలో ఉల్లంఘనలకు పాల్పడినట్లు లేఖలో వెల్లడించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/