ప్రముఖ సాహితీవేత్త కన్నుమూత

Indraganti Srikanth Sharma
Indraganti Srikanth Sharma

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ తండ్రి,ప్రముఖ సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకుతుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు.ఆయన వయస్సు 75 ఏళ్లు. ఇంద్రగంటి భార్య జానకీబాల కూడా రచనారంగంలో స్థిరపడ్డారు.జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన రచయితగా స్థిరపడ్డారు. ఆల్ ఇండియా రేడియో విజయవాడ కేంద్రంలో పనిచేశారు. పలు కథలు, నాటకాలు, గేయాలు, సినీ గీతాలు శ్రీకాంత్ శర్మ రచించారు. కృష్ణావతారం, నెలవంక, రెండు జళ్ల సీత, పుత్తడిబొమ్మ వంటి సినిమాల్లో పాటలు రాశారు. మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఖసమ్మోహనంగ సినిమాలో ఖమనసైనదేదోగ ఆయన చివరగా రాసిన పాట.. ఇవాళ సాయంత్రం అల్వాల్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/