శ్రీలలితా త్రిపురసుందరీదేవి

నేటి అలంకారం

శ్రీలలితా త్రిపురసుందరీదేవి

 Sri Lalitha Tripura sundari devi
Sri Lalitha Tripura sundari devi

” ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథుల మౌక్తిక శోభినాశమ్‌ ఆకర్ణదీర్ఘ నయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్‌ దసరా ఉత్సవాలలో నాలుగవ రోజున శనివారం అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు. త్రిపురాత్రయంలో రెండో శక్తి లలితా అమ్మవారు. దేవీ ఉపాస కులకు ఈమె ముఖ్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం లలిత త్రిపురసుందరీదేవి అమ్మవారు. శ్రీ పార్వతి, శ్రీలక్ష్మీ, శ్రీ సరస్వతిల శక్తులతో కూడిన దివ్యశక్తులను కలిగిన మాతగా శ్రీ లలితా త్రిపురసుందరీదేవి దర్శనమిస్తుంది. పంచదశాక్షరీ మహామంత్ర అధిష్టాన దేవతగా లలిత త్రిపురసుందరిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈ అమ్మవారు. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో కుడివైపున శ్రీలక్ష్మీదేవి, ఎడమ వైపున శ్రీసరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. ఇరు ప్రక్కల లక్ష్మీ సరస్వతులను వుంచుకొని, మనం ప్రార్ధించిన వెంటనే దారిద్య్ర దుఃఖాలను తొలగించి, సకల ఐశ్వార్యాభీష్టాలను ఈ అమ్మవారు సిద్ధింపజే స్తుంది. ఈమె శ్రీవిద్యా స్వరూపిణి. సృష్టి, స్థితి, సంహార రూపిణి, కుంకుమతో నిత్యపూ జలు చేసే సువాసినులకు(ముత్తైదువలు) ఈ తల్లి మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. అలంకారం: కూడిన అమ్మవారిని గంధపు వర్ణంతో పట్టు చీరతో అలంకరిస్తారు. మంత్రం: ”ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రేనమః అనే మంత్రాన్ని 108సార్లు జపించాలి. శ్రీచక్రానికి లలితా అష్టోత్తరంతో కుంకుమార్చన చేస్తూ పూజించాలి. నివేదన: గారెలు నివేదన చెయ్యాలి. మాంగల్యబలం కోరుతూ సువాసినిలకు పూజ చేయ్యాలి.