కెసిఆర్‌ నాయకత్వంలో తెలంగాణ సుభీక్షంగా ఉంది

తెలంగాణ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్‌ రెడ్డి

allola indra karan reddy
allola indra karan reddy

నిర్మల్‌: తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరాకాల వాంఛ అయినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనను కెసిఆర్‌ నెరవేర్చారని తెలంగాణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. నిర్మల్‌ పట్టణంలో తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ సందర్బంగా పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. టిఆర్‌ఎస్‌ పార్టీ నేడు ఈ స్థాయిలో ఉండడానికి కారణం కెసిఆర్‌ నాయకత్వమేఅని, ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా నేడు తెలంగాణ పునర్నిమాణానికి ఎంతో పాటుపడుతున్నారని అన్నారు. తెలంగాణలో ప్రజలకు అవసరమయ్యే పథకాలు ప్రవేశపెడుతు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. కెసిఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ఎంతో సుభీక్షంగా ఉందని మంత్రి కొనియాడారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/